AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: వావ్.. 42 ఏళ్ల వయసులోనూ చిరుతలా దూకి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన ధోని.. వీడియో చూశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు . 42 ఏళ్ల వయసులోనూ చిరుత పులిలా డైవ్ చేస్తూ అతను అందుకున్న క్యాచ్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

IPL 2024: వావ్.. 42 ఏళ్ల వయసులోనూ చిరుతలా దూకి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన ధోని.. వీడియో చూశారా?
MS Dhoni
Basha Shek
|

Updated on: Mar 27, 2024 | 4:20 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు . 42 ఏళ్ల వయసులోనూ చిరుత పులిలా డైవ్ చేస్తూ అతను అందుకున్న క్యాచ్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేయకున్నా ఈ సూపర్బ్ క్యాచ్ తో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ‘ధోనికి అసలు వయసై పోలేదు, టైగర్ జిందా హై’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మంగళవారం (మార్చి 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు శివమ్ దూబే (51) మెరుపు అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (8), వృద్దిమాన్ సాహా (21) తొందరగానే ఔటయ్యారు.

4వ నంబర్‌లో బరిలోకి దిగిన విజయ్ శంకర్ 11 బంతుల్లో 12 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకునేలా కనిపించాడు. అయితే డారిల్ మిచెల్ వేసిన 8వ ఓవర్ 3వ బంతికి విజయ్ శంకర్ బ్యాట్ బంతి ఫస్ట్ స్లిప్‌లోకి వెళ్లింది. అయితే చిరుత పులిలా దూకిన మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇవి కూడా చదవండి

ధోని హైలెట్ క్యాచ్.. వీడియో ఇదిగో..

అదే మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే వేసిన 12వ ఓవర్‌లో 5 బంతుల్లో డేవిడ్ మిల్లర్ డీప్ మిడ్ వికెట్‌ దిశగా షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ నుంచి ముందుకు పరుగెత్తి వచ్చిన అజింక్య రహానే డైవింగ్ క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు CSK జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల అద్భుతమైన ఫీల్డింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులందరూ ఫిదా అవుతున్నారు.

అజింక్య రహానె మెరుపులు:

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సీఎస్‌కే జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...