SRH vs MI, IPL 2023: ముంబైతో కీలక పోరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను భయపెడుతోన్న ‘SIR’..
IPL 2023, Sunrisers Hyderabad vs Mumbai Indians, 25th Match: ధోనీ-విరాట్ కీలక పోరు తర్వాత ప్రస్తుతం అందరి చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. అయితే, హైదరాబాద్ టీంకు 'SIR' భయం పట్టుకుంది.
ధోనీ-విరాట్ కీలక పోరు తర్వాత ప్రస్తుతం అందరి చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. నేడు ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. అయితే, హైదరాబాద్ టీంకు ‘SIR’ భయం పట్టుకుంది. ఇక్కడ ముంబై తరపున ఆడుతోన్న SIRతో సన్‌రైజర్స్ హైదరాబాద్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ సర్ గోల ఏంటని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం..
హైదరాబాద్‌లో ‘SIR’ ఆందోళన..
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో ‘SIR’ సందడి వినిపించనుంది. ‘SIR’ అంటే ఎవరో కాదు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లు. ‘ఎస్’ అంటే సూర్యకుమార్ యాదవ్‌కు, ఐ అంటే ఇషాన్ కిషన్, ఆర్ అంటే రోహిత్ శర్మ.
View this post on Instagram
ఈ ముగ్గురు ఆటగాళ్లు రెచ్చిపోతే.. హైదరాబాద్ ఆటలు సాగవు. ఒకవేళ వీరిని తర్వగా పెవిలియన్ చేర్చితేనే మైదరాబాద్ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐపీఎల్ పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సూర్యకుమార్ యాదవ్ 137 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 300 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ 2023లో సూర్యకుమార్ ఫామ్‌లో కనిపించడం లేదు. కానీ, చివరి మ్యాచ్‌లో అతను 25 బంతుల్లో 172 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేశాడు.
View this post on Instagram
SRHపై కూడా ఇషాన్ కిషన్ ఆట అద్భుతంగా ఉంది. అతను 136 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 290 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 325 పరుగులు రోహిత్ శర్మ పేరిట నమోదయ్యాయి. ఈరోజు ‘SIR’ ఆడితే ముంబై ఇండియన్స్‌కు ఇబ్బంది ఉండదు. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రం టెన్షన్ పెరిగే పరిస్థితి ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..