RCB Vs CSK: కేవలం 11 బంతులే.. ధోని టీంని మాములుగా భయపెట్టలేదుగా.. ఆ ప్లేయర్ ఎవరంటే?
బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా నిలిచిన ఈ పిచ్‌పై ఇరు జట్లు పరుగుల వరద పారించడమే కాదు.. ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించారు. రెండు జట్లు కలిపి ఏకంగా 24 ఫోర్లు, 33 సిక్సర్లతో 444 పరుగులు నమోదు చేశాయి.
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా నిలిచిన ఈ పిచ్‌పై ఇరు జట్లు పరుగుల వరద పారించడమే కాదు.. ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించారు. రెండు జట్లు కలిపి ఏకంగా 24 ఫోర్లు, 33 సిక్సర్లతో 444 పరుగులు నమోదు చేశాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(83), దూబే(52) తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. ఇక 227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆర్సీబీకి.. తొలి ఓవర్‌లో కోహ్లీ వికెట్ రూపంలో షాక్ తగిలింది. 6 పరుగులకు విరాట్ పెవిలియన్ చేరాడు. అయితేనేం ఆ తర్వాత వచ్చిన డుప్లెసిస్, మాక్స్‌వెల్ ఊచకోత మొదలెట్టారు. ఈ ఇద్దరూ సీఎస్‌కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. కానీ వీరిద్దరూ కూడా వరుసగా అవుట్ కావడంతో.. చివరికి ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, నిర్ణీత ఓవర్లకు ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగలిగింది.
ఇంపాక్ట్ ప్లేయర్ మెరుపులు..
మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ ఔట్ కాగానే.. దాదాపుగా మ్యాచ్ అయిపోయిందని ఆర్సీబీ ఫ్యాన్స్ భావించారు. కానీ చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్(28).. సుయాష్ ప్రభుదేశాయ్(19)తో కలిసి దాదాపు టార్గెట్ వరకు తీసుకొచ్చారు. కానీ చివర్లో దినేష్ కార్తీక్, పార్నెల్ వరుస క్రమంలో ఔట్ కావడంతో.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సుయాష్ ప్రభుదేశాయ్.. 2 సిక్సర్లతో చివర్లో ఆర్సీబీ డగౌట్‌లో ఆశలు కల్పించాడు. అయితే పాతిరానా ఆఖరి ఓవర్‌లో చక్కటి బౌలింగ్ చేసి.. అతడ్ని పెవిలియన్ చేర్చాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం..
Shot of the day ~ Reserve scoop from Suyash Prabhudessai!#TATAIPL#IPL2023#RCBvCSK pic.twitter.com/LSIuBcGME3
— Nilesh G (@oye_nilesh) April 17, 2023