IPL 2023: నేటితో ఉత్కంఠకు తెర.. ఐపీఎల్ జట్లు రిటైన్, రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబిత?
IPL Retention: మినీ వేలానికి ముందు, అన్ని జట్లు ఆటగాళ్లను రిటెన్షన్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 15 అంటే నేటితో ఈ గడువు ముగిసిపోనుంది.
ఐపీఎల్ 2023 (IPL 2023) పై ఉత్కంఠ మొదలైంది. మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. అయితే, మినీ వేలానికి ముందు, అన్ని జట్లు ఆటగాళ్లను రిటెన్షన్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 15 అంటే నేటితో ఈ గడువు ముగిసిపోనుంది. ఇటువంటి పరిస్థితిలో ఆటగాళ్ల రిటెన్షన్, విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు ఏ జట్లు పేర్లను ఖరారు చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం.. IPL 2022 లాగా, IPL 2023 లోనూ మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2023 మినీ వేలంలోకి ప్రవేశించే ముందు అన్ని జట్లు తమ వాలెట్‌లలో డబ్బు ఉంచుకునేందుకు, కొందరు ఆటగాళ్లను విడుదల చేస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)..
4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ బలాన్ని పెంచుకునేందుకు మంచి ఆటగాళ్ల కోసం వెతుకుతోంది. IPL 2023 మినీ వేలంలో ఈ శోధనకు ముగింపు పలకాలని కోరుకుంటుంది.
CSK నిలబెట్టుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్
CSK నుంచి విడుదలైన ఆటగాళ్లు: క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్
ముంబై ఇండియన్స్ (MI)..
ఐపీఎల్ 2022 ముంబై ఇండియన్స్‌కు సరిగ్గా జరగలేదు. కానీ, తర్వాతి సీజన్‌లో అంటే IPL 2023లో ఈ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలనే మూడ్‌లో ఉంది. దీని కోసం ముంబై జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ట్రేడ్ చేసింది.
ముంబై రిటైన్డ్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రూయిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్స్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ.
MI విడుదల చేసిన ఆటగాళ్ళు: ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, టిమల్ మిల్స్, మయాంక్ మార్కండే, హృతిక్ షోకీన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)..
ఐపీఎల్ 16వ సీజన్ జరగబోతోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది. ఈ నిరీక్షణను ముగించడానికి, వారు బలమైన జట్టును ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
RCB నిలుపుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, రజత్ పాటిదార్
RCB విడుదలైన ఆటగాళ్లు: సిద్ధార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, ఆకాష్ దీప్
గుజరాత్ టైటాన్స్ (GT)..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ IPL 2022లో అరంగేట్రం చేసింది. తొలి సీజన్‌లోనే ఈ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ జట్టు మినీ వేలం సహాయంతో మరికొంత మంది ఆటగాళ్లను చేర్చుకోవాలని చూస్తోంది.
GT రిటైన్డ్ ప్లేయర్స్: హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుభమాన్ గిల్, అభినవ్ మనోహర్, వృద్ధిమాన్ సాహా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా. రహ్మానుల్లా గుర్బాజ్
GT నుంచి విడుదలైన ఆటగాళ్లు: మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, గురుకీరత్ మాన్ సింగ్, జయంత్ యాదవ్, ప్రదీప్ సాంగ్వాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, వరుణ్ ఆరోన్
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)..
IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ బడ్జెట్‌లో మంచి జట్టును తయారు చేసింది. మినీ వేలం ద్వారా, జట్టులోని కొన్ని లొసుగులను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.
DC నిలుపుకున్న ఆటగాళ్లు: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, అన్రిచ్ నోర్కియా, కుల్దీప్ యాదవ్
DC నుంచి విడుదలైన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, టిమ్ సిఫెర్ట్, KS భరత్, మన్‌దీప్ సింగ్, అశ్విన్ హెబర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)..
కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2023 కోసం లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను ట్రేడ్ చేసింది.
టాప్ రిటైన్డ్ ప్లేయర్స్: శ్రేయాస్ అయ్యర్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, పాట్ కమిన్స్, నితీష్ రాణా, షెల్డన్ జాక్సన్, రింకు సింగ్, ఉమేష్ యాదవ్
కోల్‌కతా నుంచి విడుదలయ్యే ఆటగాళ్లు: శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, రమేష్ కుమార్, అజింక్యా రహానే, ఆరోన్ ఫించ్
రాజస్థాన్ రాయల్స్ (RR)..
IPL 2023 మినీ వేలం ద్వారా, రాజస్థాన్ రాయల్స్ కూడా తమ జట్టులోని కొన్ని లోపాలను సరిదిద్దాలనుకుంటోంది. దీని కోసం, ఈ జట్టు కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయడం కూడా చూడొచ్చు.
టాప్ రిటైన్డ్ ప్లేయర్స్: సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్, ఫేమస్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్
విడుదలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు: నవదీప్ సైనీ, డారిల్ మిచెల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, కార్బిన్ బాస్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)..
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లను రిటైన్, విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే, విడుదల చేయగల పెద్ద పేరులో మనీష్ పాండే ఉంటాడని నమ్ముతున్నారు. ఇది కాకుండా అంకిత్ రాజ్‌పుత్, ఆండ్రూ టై కూడా ఆ జాబితాలోకి రావచ్చు.
పంజాబ్ కింగ్స్ (PBKS)..
కెప్టెన్ విషయంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2023కి జట్టు కెప్టెన్సీని శిఖర్ ధావన్‌కు అప్పగించింది. మరి టీమ్‌లో ఎవరిని రిటైన్ చేసి రిలీజ్ చేస్తారో చూడాలి మరి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)..
కేన్‌తో పాటు రొమారియో షెపర్డ్, జగదీశ్ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్ సమద్, శ్రేయాస్ గోపాల్‌లను సన్‌రైజర్స్ యాజమాన్యం వదిలేయనున్నట్లు సమాచారం. మరి కేన్ విలియమ్సన్‌ను హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకుంటుందో.. వదిలేస్తుందో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..