IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ నుంచి విడుదలయ్యే ప్లేయర్స్ వీరే.. లిస్టులో తుఫాన్ బ్యాట్స్‌మన్..
Lucknow Supergiants Released Players: ఐపీఎల్ 2023 కోసం మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ కొంతమంది ఆటగాళ్లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ జాబితాలో బలమైన బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడు.
ఐపీఎల్ 2023 (IPL 2023) ట్రోఫీ కోసం లక్నో సూపర్ జెయింట్ తన సన్నాహాలను ప్రారంభించింది. ఈసారి మినీ వేలానికి ముందు జట్టు చాలా మంది ఆటగాళ్లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. 2022 ఐపీఎల్‌లో లక్నో అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఏడాదిలోనే జట్టు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. లక్నో ఈసారి ఎవరిని విడుదల చేయనుందో ఇప్పుడు చూద్దాం..
మనీష్ పాండే..
లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి డాషింగ్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండేని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. రూ. 1 కోటి బేస్ ప్రైస్ ఉన్న మనీష్ పాండేని లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలంలో 4.60 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అతని పేలవమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆండ్రూ టై..
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టైని లక్నో సూపర్ జెయింట్స్ 2022 మెగా వేలంలో రూ.1 కోటి ధరకు కొనుగోలు చేసింది. అతను గత సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో 2 వికెట్లు పడగొట్టాడు. 9.73 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఈసారి అతడిని జట్టు నుంచి తప్పించవచ్చని భావిస్తున్నారు.
అంకిత్ రాజ్‌పుత్..
లక్నో సూపర్ జెయింట్ అంకిత్ రాజ్‌పుత్‌ను 2022 మెగా వేలంలో రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఈసారి టీమ్ అతడిని విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నారు.
షాబాజ్ నదీమ్..
షాబాజ్ నదీమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 లక్షల ధరకు కొనుగోలు చేసింది. ఈసారి అతడిని విడుదల చేయాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉందని తెలుస్తోంది.
కృష్ణప్ప గౌతమ్..
2022 మెగా వేలంలో కృష్ణప్ప గౌతమ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి అతడిని తప్పించాలని టీమ్ ఆలోచనలో పడింది.
మనన్ వోహ్రా..
మనన్ వోహ్రాను లక్నో సూపర్ రూ. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి మినీ వేలానికి ముందే అతడిని టీమ్ విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
ఎవిన్ లూయిస్..
వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్‌ను 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను గత సీజన్‌లో 6 మ్యాచ్‌లలో 24.33 సగటు, 130.36 స్ట్రైక్ రేట్‌తో 73 పరుగులు చేశాడు.
మయాంక్ యాదవ్..
2022 మెగా వేలంలో మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఈసారి ఆయన విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కరణ్ శర్మ..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కరణ్ శర్మను లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధర రూ. 20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది. ఈసారి జట్టు అతన్ని విడిచిపెట్టవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..