AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: వేటేసిన ముంబై ఇండియన్స్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన డేంజరస్ బ్యాటర్..

Kieron Pollard Retirement: మరికొన్ని సంవత్సరాలు ఆడాలనుకుంటున్నానని, అయితే ముంబైతో మాట్లాడిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

IPL 2023: వేటేసిన ముంబై ఇండియన్స్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన డేంజరస్ బ్యాటర్..
Ipl 2023 Mumbai Indians
Venkata Chari
|

Updated on: Nov 15, 2022 | 3:10 PM

Share

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ సీజన్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ పొలార్డ్‌ను విడుదల చేయనుందని ఇటీవల ఒక నివేదిక వెలువడిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల పాటు ముంబై తరపున ఆడిన పొలార్డ్‌ను ముంబై విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇప్పుడు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పొలార్డ్ పదవీ విరమణ చేస్తున్నట్లు సుదీర్ఘమైన పోస్ట్‌ను రాసుకొచ్చాడు. అందులో అతను మరికొన్ని సంవత్సరాలు ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన తర్వాత, అతను రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ముంబైలో తప్ప ఇంకే జట్టు తరపున ఆడలేను- పొలార్డ్

పొలార్డ్ తన పోస్ట్‌లో, “ముంబై టీంలో మార్పులు అవసరం. నేను ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ఆడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ ముంబైకి అండగానే ఉంటాను” అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ కెరీర్..

పొలార్డ్ తన కెరీర్ మొత్తాన్ని ముంబైతో ఆడాడు. 171 ఇన్నింగ్స్‌లలో 3412 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో పొలార్డ్ బ్యాటింగ్ సగటు 28.67 కాగా, అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 147.32గా నిలిచింది. 16 అర్ధ సెంచరీలు చేసిన పొలార్డ్ లీగ్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. దశాబ్దానికి పైగా ముంబై ప్లేయింగ్ XIలో అత్యంత నిలకడగా ఉన్న పొలార్డ్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను గత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 14.40 సగటుతో 144 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్-రేట్ కూడా 107.46 మాత్రమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..