IPL 2023: కేన్ మామతో సహా 12 మంది ప్లేయర్లు ఔట్.. సన్‌రైజర్స్ షాకింగ్ నిర్ణయం.. రిటైన్ ఆటగాళ్ల జాబితా ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా నిరాశపరిచింది. రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఈ జట్టు నుంచి విడిపోవడంతో ఫ్రాంచైజీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
IPL 2023కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జట్టులోని పలువురు స్టార్ ఆటగాళ్లను వదిలేసుకుంది. ఈ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. చాలామందిని ఆశ్చర్యపరుస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా మంది యువ ఆటగాళ్లను జట్టులో ఉంచుకుంది. ఇకపై ఇతర జట్లు ట్రేడ్ కాకుండా విడుదలైన ఆటగాళ్లను డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ వేలంలో చేర్చనున్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా నిరాశపరిచింది. రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఈ జట్టు నుంచి విడిపోవడంతో ఫ్రాంచైజీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ 14 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలిచింది. 8 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది, ఫలితంగా సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. దీంతో ఈసారి జట్టులో భారీ మార్పులకు తెరతీసింది.
విడుదలైన ఆటగాళ్ల జాబితా..
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీష్ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్
రిటైన్ ప్లేయర్లు వీళ్లే..
అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, ఫజ్లక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
#OrangeArmy, here are the #Risers who will continue to be a part of our journey for #IPL2023 ? #SunRisersHyderabad pic.twitter.com/B3ExEz8bP3
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
కాగా సన్‌రైడర్స్ హైదరాబాద్ 2013లో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. ఇక 2014, 2015 సీజన్లలో లీగ్ దశను దాటి ముందుకు సాగలేకపోయింది. 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఈ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. 2017లో ఈ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2018లో టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ 2019, 2020లో ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే 2021, 2022లో ఈ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది ఈ రెండు సార్లు కనీసం లీగ్ దశను దాటలేకపోయింది.
— SunRisers Hyderabad Trends ™ (@TrendsSRH) November 15, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..