IPL 2023: స్టార్ ఆటగాళ్లకు ముంబై భారీ షాక్ .. పొలార్డ్‌తో సహా ఏకంగా 13 మంది ఔట్.. రిటైన్ ప్లేయర్స్ లిస్టు ఇదే
ఐపీఎల్ 2023 కోసం ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలించుకుంది ముంబై. కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, టైమల్ మిల్స్ వంటి స్టార్ క్రికెటర్లకు కూడా షాక్ ఇచ్చింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్‌ది అగ్రస్థానం. రోహిత్ నేతృత్వంలోని ఈ జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే గత ఏడాది సీజన్‌లో మాత్రం రోహిత్ సేన పూర్తిగా చేతులెత్తేసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచింది.ఈనేపథ్యంలో రాబోయే సీజన్‌లో మెరుగ్గా రాణించాలని ముంబై పట్టుదలతో ఉంది. ఇందుకోసం జట్టులో భారీ మార్పులకు తెరతీసింది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2023 కోసం ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలించుకుంది. కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, టైమల్ మిల్స్ వంటి స్టార్ క్రికెటర్లకు కూడా షాక్ ఇచ్చింది. కాగా తమ ఆటగాళ్ల రిటైన్ లిస్టును బీసీసీఐకి అందజేయడానికి ముందు ముంబై ఇండియన్స్ మరో బిగ్ డెసిషన్ తీసుకుంది. తమ బౌలింగ్ ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి గతేడాది ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడిన ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్‌ను ట్రెడ్ చేసుకుంది. కాగా ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చి వేదికగా జరగనుంది.