Royal Challengers Bangalore: కేజీఎఫ్‌పైనే ఆధారపడిన ఆర్‌సీబీ టీం.. ఇలా అయితే, ప్లేఆఫ్స్‌కు చేరేనా?
Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పూర్తిగా విరాట్, ఫాఫ్, మాక్స్‌వెల్‌పై ఆధారపడింది. దీని కారణంగా జట్టుకు ముందున్న మార్గం కష్టంగా మారింది.
Indian Premier League 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రదర్శన చాలా అస్థిరంగానే ఉంది. ఈ సీజన్‌లో RCB 8 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 గెలిచి 4 ఓడిపోయింది. ఈ సీజన్‌లో వరుసగా 2 పరాజయాలకు చెక్ పెట్టేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. కానీ, ఘోర పరాజయం పాలైంది. దీనికి అతిపెద్ద కారణం మిడిల్ ఆర్డర్‌లో ఆశించిన ప్రదర్శనలో ఘోర వైఫల్యం.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పూర్తిగా ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌పై ఆధారపడి ఉంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో, RCB బ్యాటింగ్ KGF పై ఆధారపడి ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒక మ్యాచ్‌లో పెవిలియన్‌కు తిరిగి వస్తే.. అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. RCB బ్యాట్స్‌మెన్‌కు ఇక్కడ నుంచి పరుగులు చేయడం చాలా కష్టపడుతున్నారు.
ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఫాఫ్ డు ప్లెసిస్ 422 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 333 పరుగులు చేయగా, గ్లెన్ మాక్స్‌వెల్ 258 పరుగులు చేశారు. ఈ ముగ్గురి తర్వాత, ఇప్పటివరకు 83 పరుగులు మాత్రమే చేసిన దినేష్ కార్తీక్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో మెరుగైన ఆటను ప్రదర్శించాల్సిందే..
ఈ సీజన్ ప్రథమార్థంలో ఆర్‌సీబీ జట్టు తమ సొంత మైదానంలో 6 మ్యాచ్‌లు ఆడగా, ఇప్పుడు చిన్నస్వామిలో 1 మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఆ జట్టు ఇతర జట్ల హోమ్ గ్రౌండ్‌కి వెళ్లి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అందులో మంచి ప్రదర్శన చేయడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆర్‌సీబీ చాలా మంచి ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది. జట్టు తన తదుపరి మ్యాచ్‌ను మే 1న లక్నోతో ఆడాల్సి ఉంది.
మొయిన్ అలీ 11 బంతుల్లో 23 పరుగులు చేసి ఆడమ్ జంపాకు బలి అయ్యాడు. డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్‌లను జంపా క్యాచ్ అవుట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 3 బంతుల్లో అజింక్యా రహానె, అంబటి రాయుడులను పెవిలియన్ పంపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..