AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs PBKS: థ్రిల్లింగ్‌ ఫైట్‌లో పంజాబ్‌దే పైచేయి.. భారీ స్కోరు చేసినా ధోని సేనకు తప్పని ఓటమి

పంజాబ్‌ కింగ్స్‌ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. ఆదివారం చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేనపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్‌. చెన్నై విధించిన 201 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతికి ఛేదించింది.

CSK vs PBKS: థ్రిల్లింగ్‌ ఫైట్‌లో పంజాబ్‌దే పైచేయి.. భారీ స్కోరు చేసినా ధోని సేనకు తప్పని ఓటమి
Csk Vs Pbks Match
Basha Shek
|

Updated on: Apr 30, 2023 | 8:01 PM

Share

పంజాబ్‌ కింగ్స్‌ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. ఆదివారం చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేనపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్‌. చెన్నై విధించిన 201 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతికి ఛేదించింది. మొదట్లో ఓపెనర్‌ ప్రభు సిమ్రాన్‌ (42) అదరగొడితే.. లివింగ్‌ స్టోన్‌ (40), సామ్‌ కరన్‌ (29), శిఖర్‌ ధావన్‌ (28), జితేశ్‌ శర్మ (21) తలా కొన్ని పరుగులు జోడించి జట్టుకు విజయం చేకూర్చారు. మ్యాచ్‌ ఆఖరులో షారుఖ్‌ ఖాన్‌ (2 నాటౌట్‌), సికిందర్‌ రజా (13 నాటౌట్‌) ధాటిగా ఆడి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ సికందర్ రజా ఆఖరి బంతికి 3 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా రెండు, మతీష పతిరణ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. కాగా స్వస్థలంలో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి.  92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోయిన డేవాన్ కాన్వేకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్‌ కాన్వే (92 నాటౌట్‌; 52 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (37; 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్ దూబె (28; 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) కూడా వేగంగా పరుగులు సాధించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌, రాహుల్ చాహర్‌, సికిందర్‌ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..