IPL 2023: హార్దిక్ ఇలా చేస్తే.. తొలి మ్యాచ్‌లో ధోనిదే విజయం.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారధిగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్..
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారధిగా ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ సూపర్ ఫైట్ జరగనుంది.
మొదటిగా గుజరాత్ టైటాన్స్ జట్టు పరిశీలిస్తే.. శుభ్‌మాన్ గిల్, వృద్దిమాన్ సాహా ఓపెనర్లుగా.. కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగనున్నారు. ఇక మాథ్యూ వేడ్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్‌గా రాహుల్ టేవాటియా, స్పిన్నర్‌గా రషీద్ ఖాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ డ్యూటీలను శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్ చేపట్టనున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయానికొస్తే.. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లు, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు మిడిల్ ఆర్డర్‌లో, ఫినిషర్‌గా బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా.. వికెట్ కీపర్ బాధ్యతలను ఎం.ఎస్.ధోని చేపట్టనున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా దీపక్ చాహార్, ముకేష్ చౌదరీ, మతీశా పతిరాణ వ్యవహరించనున్నారు. కాగా, హార్దిక్ తన జట్టులో టెస్టు స్పెషలిస్టులను కాకుండా.. టీ20 హిట్టర్లను ఎంచుకుంటే.. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌దే గెలుపు అని.. లేదంటే చెన్నై విజయం సాధిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్(ప్లేయింగ్ 11- అంచనా):
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరన
గుజరాత్ టైటాన్స్(ప్లేయింగ్ 11 – అంచనా)
శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్