IPL 2022 Points Table: ఐదో స్థానంలోకి దూసుకొచ్చిన లక్నో.. అట్టడుగు స్థానంలో సన్‌రైజర్స్‌.. అగ్రస్థానం ఆ జట్టుదే..

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (SRH vs LSG) జట్లు తలపడ్డాయి. రాహుల్‌, దీపక్‌హుడాల బ్యాటింగ్‌కు తోడు అవేశ్‌ఖాన్‌ సూపర్‌ స్పెల్‌తో హైద్రాబాద్‌పై 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.

IPL 2022 Points Table: ఐదో స్థానంలోకి దూసుకొచ్చిన లక్నో.. అట్టడుగు స్థానంలో సన్‌రైజర్స్‌.. అగ్రస్థానం ఆ జట్టుదే..
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: Apr 05, 2022 | 6:21 AM

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ (SRH vs LSG) జట్లు తలపడ్డాయి. రాహుల్‌, దీపక్‌హుడాల బ్యాటింగ్‌కు తోడు అవేశ్‌ఖాన్‌ సూపర్‌ స్పెల్‌తో హైద్రాబాద్‌పై 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. తద్వారా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు లక్ష్యానికి చేరువగా వచ్చి చివర్లో వరుస వికెట్లు కోల్పోయిన హైద్రాబాద్‌ టోర్నీలో రెండో పరజాయాన్ని మూటగట్టుకుంది. తాజా విజయంతో రాహుల్‌ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు (రెండు విజయాలు , ఒక ఓటమి) ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ఇంకా టోర్నీలో బోణి కొట్టని సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్‌ మొదటి స్థానంలో ఉండగా, మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 2వ స్థానంలో ఉంది. ఇక హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ ( రెండు విజయాలు) మూడో స్థానంలో, మయాంక్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ ( రెండు విజయాలు, ఒక ఓటమి) నాలుగు, ఢిల్లీ క్యాపిట్సల్‌ ( ఒక గెలుపు, ఒక ఓటమి) ఆరో ప్లేసులో, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఒక ఓటమి, ఒక గెలుపు), ఏడో స్థానంలో, ఇక టోర్నీలో విజయాల ఖాతా తెరవని ముంబై ఇండియన్స్‌, చెన్నై వరుసగా 8,9 వ స్థానాల్లో ఉన్నాయి.

ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికి బహూకరించే ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ ముందున్నాడు. అతను రెండుమ్యాచ్‌ల్లో 135 పరుగులు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్‌ రెండో ప్లేసులో ఉన్నాడు. కాగా హైద్రాబాద్‌తో అర్ధసెంచరీ చేసిన లక్నో బ్యాటర్‌ దీపక్‌ హుడా మూడో స్థానానికి ఎగబాకాడు. ఇక చెన్నైకి చెందిన శివమ్ దూబే నాలుగో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ తో కెప్టెన్సీ ఇన్సింగ్స్‌ తో ఆకట్టుకున్న రాహుల్‌ ఐదో ప్లేసులో నిలిచాడు.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో..

టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. ఇక హైద్రాబాద్‌తో నాలుగు వికెట్లు తీసిన లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ 7 వికెట్లతో రెండో స్థానంలోకి వచ్చాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో రాహుల్‌ చాహర్‌ మూడో స్థానంలో, 5 వికెట్లతో యుజువేంద్ర చాహల్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ ఐదో స్థానంలో ఉన్నాడు.

Also Read:SRH vs LSG, IPL 2022: ఊరించి ఉసూరుమనిపించి.. ఛేదనలో చతికిలపడిన సన్‌ రైజర్స్‌.. 12 పరుగుల తేడాతో పరాజయం..

IPL 2022 Uncapped Players: ఆయుష్ నుంచి లలిత్ వరకు.. ఐపీఎల్ 2022‌లో అదరగొడుతోన్న అన్‌క్యాప్డ్ ప్లేయర్స్..

Multibagger Stocks: రూ. 13వేల పెట్టుబడిని రూ. కోటిగా మార్చిన బంపర్ స్టాక్.. అదేంటంటే?