IPL 2022 Uncapped Players: ఆయుష్ నుంచి లలిత్ వరకు.. ఐపీఎల్ 2022‌లో అదరగొడుతోన్న అన్‌క్యాప్డ్ ప్లేయర్స్..

ఐపీఎల్ 15వ సీజన్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కంటే అన్‌క్యాప్డ్ ఆటగాళ్లే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లక్నోకు చెందిన ఆయుష్ బదోనీ నుంచి పంజాబ్‌కు చెందిన జితేష్ శర్మ వరకు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు.

IPL 2022 Uncapped Players: ఆయుష్ నుంచి లలిత్ వరకు.. ఐపీఎల్ 2022‌లో అదరగొడుతోన్న అన్‌క్యాప్డ్ ప్లేయర్స్..
Ipl 2022 Uncapped Players
Follow us
Venkata Chari

|

Updated on: Apr 04, 2022 | 9:36 PM

తక్కువ డబ్బుతో కొనుగోలు చేసిన ఈ ఆటగాళ్లు తమ మెరుగైన ప్రదర్శనతో ఐపీఎల్ 2022(IPL 2022)లో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు, జట్లు ఎవరిపైనైతే ఎక్కువ డబ్బు ఖర్చు చేశాయో, వారిలో కొంతమంది ఆటగాళ్లు మాత్రం చాలా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కంటే అన్‌క్యాప్డ్ ఆటగాళ్లే(Uncapped Players) అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లక్నోకు చెందిన ఆయుష్ బదోనీ(Ayush Badoni) నుంచి పంజాబ్‌కు చెందిన జితేష్ శర్మ వరకు తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు.

ఆయుష్ బదోని: లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతోన్న ఆయుష్ బదోని.. అతని ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు జట్టు కొనుగోలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నో తరపున ఆయుష్ బదోని అద్భుత ఆటతీరు కనబరిచాడు. లక్నో తరపున తొలి మ్యాచ్‌లో 54 పరుగులు, చెన్నైపై 19 పరుగులతో ఆయుష్ జట్టును గెలిపించాడు. ఈ లీగ్‌లో అతను ఇప్పటివరకు 74 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ: ముంబై ఇండియన్స్ తరపున ఆడిన తిలక్ వర్మను ఆ జట్టు రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల తిలక్ వర్మ ఈ లీగ్‌లో ఇప్పటి వరకు రెండు ఇన్నింగ్స్‌ల్లో 83 పరుగులు చేశాడు. తిలక్ రాజస్థాన్‌పై 61, ఢిల్లీపై 22 పరుగులు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ, ముంబై వేలం వ్యూహాన్ని బట్టి అతని ప్రతిభను అంచనా వేయవచ్చు.

లలిత్ యాదవ్: ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చిన లలిత్ యాదవ్‌ను ఢిల్లీ కేవలం రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. ఢిల్లీపై ఆల్ రౌండర్ లలిత్ యాదవ్ 38 బంతుల్లో 48 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. అదే సమయంలో, అతను గుజరాత్‌పై 25 పరుగులు చేశాడు. ఢిల్లీ తరపున లలిత్ యాదవ్ ఇప్పటి వరకు 73 పరుగులు చేశాడు.

ఉమ్రాన్ మాలిక్: వేగవంతమైన పేస్‌కు పేరుగాంచిన ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఉమ్రాన్ మాలిక్ లీగ్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగా, ఉమ్రాన్ 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అందరి దృష్టి ఖచ్చితంగా ఉమ్రాన్ మాలిక్‌పైనే ఉంది. అతని అద్భుతమైన ఆట, పేస్ గురించి చర్చ కొనసాగుతుంది.

జితేష్ శర్మ: చెన్నైపై అరంగేట్రం చేసిన జితేష్ శర్మను పంజాబ్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. చెన్నైపై 3 సిక్సర్లు కొట్టడం ద్వారా జితేష్ శర్మ తన లీగ్ కెరీర్‌ను గొప్పగా ప్రారంభించాడు. 28 ఏళ్ల జితేష్ శర్మ విదర్భ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. చెన్నైపై అతని అద్భుతమైన ఆట రాబోయే మ్యాచ్‌లకు ఖచ్చితంగా అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

వైభవ్ అరోరా: మెగా వేలంలో రూ. 2 కోట్లకు అమ్ముడైన వైభవ్ అరోరా కూడా చెన్నైపై జితేష్ శర్మతో కలిసి అరంగేట్రం చేశాడు. చెన్నైపై వైభవ్ అరోరా 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ వికెట్లు పడగొట్టి చెన్నైపై పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: RR vs RCB IPL 2022 Match Preview: హ్యాట్రిక్‌పై కన్నేసిన రాజస్థాన్.. బెంగళూరుతో పోరుకు సిద్ధం.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

RR vs RCB Playing XI IPL 2022: రాజస్థాన్‌ దూకుడుకి బెంగళూరు అడ్డుకట్ట వేసేనా? రెండు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే..

కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
కోళ్లకు అందాల పోటీలు.. వీటి రేటు ఎంతో తెలుసా ??
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
రైల్వే ట్రాక్ పై పబ్జీ ఆడారు.. సడన్ గా రైలు రావడంతో..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..