IPL 2022: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల వీరులు వీరే.. లిస్టులో నలుగురు భారతీయులే..
15వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ టోర్నీలో టాప్ 5 రన్స్ చేసిన లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్క బ్యాట్స్‌మెన్ మాత్రమే 6000 మార్క్‌ను చేరుకున్నాడని మీకు తెలుసా?
ఐపీఎల్ 2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబై(Mumbai) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురుస్తుంది. అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 15వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ టోర్నీలో టాప్ 5 రన్స్ చేసిన లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక్క బ్యాట్స్‌మెన్ మాత్రమే 6000 మార్క్‌ను చేరుకున్నాడని మీకు తెలుసా? ఐపీఎల్‌లో మొత్తం ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ 5 వేలకు పైగా పరుగులు చేశారు. ఈ టోర్నమెంట్‌లో టాప్ 5 బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. IPLలో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చాయి. విరాట్ 207 మ్యాచ్‌ల్లో 37.39 సగటుతో 6283 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 6 వేల మార్క్‌ను అందుకున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. అతను తన బ్యాట్‌తో 5 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
2. పరుగులు తీయడంలో శిఖర్ ధావన్ రెండో స్థానంలో నిలిచాడు. ధావన్ 192 ఇన్నింగ్స్‌ల్లో 34.84 సగటుతో 5784 పరుగులు చేశాడు. ధావన్ 2 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు చేశాడు.
3. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ IPLలో 213 మ్యాచ్‌లలో 5611 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 31.17గా నిలిచింది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, 40 హాఫ్ సెంచరీలు సాధించాడు.
4. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా సురేశ్ రైనా నాలుగో స్థానంలో నిలిచాడు. రైనా 200 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 32.51 సగటుతో 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు చేశాడు.
5. డేవిడ్ వార్నర్ 150 మ్యాచ్‌ల్లో 41కి పైగా సగటుతో 5449 పరుగులు చేసి, ఐదో స్థానంలో నిలిచాడు. అతను తన బ్యాట్‌తో 4 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్లలో వార్నర్ టాప్‌లో ఉన్నాడు. టాప్ 5 పరుగుల జాబితాలో 40 సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కావడం విశేషం.
Also Read: Watch Video: పుష్ప స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో