Watch Video: పుష్ప స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో
IPL 2022, Mumbai Indians: రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌ను గెలవాలని కోరుకుంటోంది. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
ఐపీఎల్ 2022(IPL 2022)కి ముందు, BCCI అన్ని ఫ్రాంచైజీలకు బయో-బబుల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్రోటోకాల్‌ను కొనసాగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్‌లో 13,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎంఐ ఎరీనా(MI Arena)ను ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, జట్టు సభ్యులు, వారి కుటుంబం తప్ప, ఎవరికీ ఇందులోకి ప్రవేశం లభించదు.
పుష్ప స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ‘ఎంఐ అరేనా’ వీడియోను పంచుకుంది. దీనిలో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ‘పుష్ప స్టైల్’లో నడుస్తూ కనిపించాడు. దీనితో పాటు, అతను ఇతర ఆటగాళ్లతో పాటు సరదాగా గేమ్స్ ఆడుతూ కనిపించాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా చేతిలో తుపాకీతో కనిపించాడు. ఎంఐ ఎరీనాలో మిగిలిన జట్టు ఆటగాళ్లు కూడా ఫైరింగ్, పోలో ఆడటం ఈ వీడియోలో చూడొచ్చు.
ముంబై ఇండియన్స్ అధికారి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఎంఐ ఎరీనా అనేది ఈ సీజన్‌లో ఆటగాళ్లు పరస్పరం ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడానికి దీనిని రూపొందించాం. గత 2 సంవత్సరాలలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. కానీ, మేం ఒక కుటుంబం. ప్రతి ఒక్కరినీ సురక్షితంగా, సంతోషంగా ఉంచడం ఎంఐ బాధ్యత’ అని తెలిపారు.
ఫుట్‌బాల్ గ్రౌండ్ నుండి కేఫ్ వరకు..
ఎంఐ అరేనాలో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్ ఫీల్డ్, బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్ట్, ఫుట్ వాలీబాల్, ఎంఐ బ్యాటిల్ గ్రౌండ్, కిడ్స్ జోన్, ఎంఐ కేఫ్ ఉన్నాయి. ఇందులో అత్యాధునిక జిమ్, మసాజ్ కుర్చీలతో కూడిన లాంజ్ గది, గేమింగ్ కన్సోల్, ఆర్కేడ్ గేమ్, ఇండోర్ బాస్కెట్‌బాల్ షూటర్, మ్యూజిక్ బ్యాండ్‌లకు ప్రత్యేక వేదిక, టేబుల్ టెన్నిస్, కేఫ్, పూల్ టేబుల్, పిల్లల ఆట స్థలం ఉన్నాయి.
ఢిల్లీతో తొలి మ్యాచ్…
5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బ్రాబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు.
The opening of MI Arena was a total धमाल event! ?
P.S. You will just love Ro in this video. He was truly in his element. ??#OneFamily #MumbaiIndians MI TV pic.twitter.com/OB1MSXZpkU
— Mumbai Indians (@mipaltan) March 21, 2022
ముంబై ఇండియన్స్ షెడ్యూల్:
మ్యాచ్ నం | గేమ్ సెంటర్ | తేదీ | సమయాలు (వాస్తవికం) | వేదిక |
2 | DC vs IM | మార్చి 27, 2022 | 3:30 PM | బ్రబౌర్న్ – CCI |
9 | MI vs RR | ఏప్రిల్ 2, 2022 | 3:30 PM | డివై పాటిల్ స్టేడియం |
14 | KKR vs MI | ఏప్రిల్ 6, 2022 | 7:30 PM | MCA స్టేడియం, పూణే |
18 | RCB vs MI | ఏప్రిల్ 9, 2022 | 7:30 PM | MCA స్టేడియం, పూణే |
23 | MI vs PBKS | ఏప్రిల్ 13, 2022 | 7:30 PM | MCA స్టేడియం, పూణే |
26 | MI vs LSG | ఏప్రిల్ 16, 2022 | 3:30 PM | బ్రబౌర్న్ – CCI |
33 | MI vs CSK | ఏప్రిల్ 21, 2022 | 7:30 PM | డివై పాటిల్ స్టేడియం |
37 | LSG vs MI | ఏప్రిల్ 24, 2022 | 7:30 PM | వాంఖడే స్టేడియం |
44 | RR vs MI | ఏప్రిల్ 30, 2022 | 7:30 PM | డివై పాటిల్ స్టేడియం |
51 | GT vs MI | మే 6, 2022 | 7:30 PM | బ్రబౌర్న్ – CCI |
56 | MI vs KKR | మే 9, 2022 | 7:30 PM | డివై పాటిల్ స్టేడియం |
59 | CSK vs MI | మే 12, 2022 | 7:30 PM | వాంఖడే స్టేడియం |
65 | MI vs SRH | మే 17, 2022 | 7:30 PM | వాంఖడే స్టేడియం |
69 | IM vs DC | మే 21, 2022 | 7:30 PM | వాంఖడే స్టేడియం |
IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టుతో చేరిన తుఫాన్ బౌలర్..