Rajasthan Royals, IPL 2022: శాంసన్ సేన ఈసారైనా విన్నర్ అయ్యేనా.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తగ్గేదేలే అంటోన్న రాజస్థాన్..
రాజస్థాన్ రాయల్స్ మరోసారి సంజూ శాంసన్ కెప్టెన్సీలో రంగంలోకి దిగనుంది. 2008 నుంచి కొనసాగుతున్న టైటిల్ కరువుకు స్వస్తి పలకాలని కోరుకుంటోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొత్త సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలో తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ మొదలుకానుంది. ఈ కొత్త సీజన్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి అన్ని జట్లు మారాయి. కొన్ని పాత, ఎక్కువగా కొత్త ముఖాలతో మళ్లీ రంగంలోకి దిగేందుకు అన్ని టీమ్‌లు సిద్ధమయ్యాయి. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కూడా ట్రోఫీ కోసం సిద్ధమైంది. జట్టు ఆఫ్-సీజన్ క్యాంప్‌ను కూడా నిర్వహించింది. ఇందులో కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson)తో సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు హాజరయ్యారు. శాంసన్‌తో పాటు, రాజస్థాన్ గత సీజన్ తర్వాత ఇంగ్లండ్ లెజెండ్ జోస్ బట్లర్, యువ భారత బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌లను రిటైన్ చేసుకుంది.
2008 ఛాంపియన్స్ రాజస్థాన్ గత నెలలో జరిగిన రెండు రోజుల మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్, ప్రసీద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మార్చి 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది.
బ్యాటింగ్‌లో పరిపూర్ణం..
బ్యాటింగ్ గురించి చెప్పాలంటే శాంసన్, బట్లర్, యశస్వి కీలకంగా కానున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI గురించి మాట్లాడితే, బట్లర్, యశస్వి జట్టు ఓపెనర్లుగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ మూడవ స్థానంలో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానంలో కెప్టెన్ శాంసన్ రానున్నాడు. వీరితో పాటు, రాజస్థాన్ రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన షిమ్రోన్ హెట్మెయర్ కూడా భాగం కానున్నాడు.
ఆల్ రౌండర్‌లో ఆఫ్షన్స్ తక్కువ..
ఆల్ రౌండర్ల జాబితాలో ఈ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. జట్టులో జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, డారిల్ మిచెల్ ప్రధాన ఆల్ రౌండర్లుగా ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇందులో నీషమ్, పరాగ్, అశ్విన్ మాత్రమే ఎంట్రీ ఇవ్వగలరు. ఎందుకంటే ఈ పాత్రలో మిచెల్ తనని తాను పెద్దగా నిరూపించుకోలేదు.
బౌలింగ్‌లో తగ్గేదేలే..
రాజస్థాన్ బౌలింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా కుప్ప కూల్చే బౌలర్లు ఉన్నారు. న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, రైజింగ్ ఇండియన్ పేసర్ ప్రసీద్ద్ కృష్ణ రూపంలో ఇద్దరు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది. అయితే స్పిన్ విభాగం యుజ్వేంద్ర చాహల్, అశ్విన్ భుజాలపై ఉంది. మీడియం పేసర్ నీషమ్, రియాన్ పరాగ్ పార్ట్ టైమ్ స్పిన్ కూడా జట్టుకు అండగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
సంజు శాంసన్ (కెప్టెన్-కీపర్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ధ్ కృష్ణ
Also Read: ICC Women’s World Cup 2022: ఝులన్ గోస్వామి మరో రికార్డు.. ఆ లిస్టులో ప్రపంచంలోనే తొలి బౌలర్..
Women’s World Cup 2022: కష్టాల్లో టీమిండియా.. రెండు వికెట్లు డౌన్.. ఓడితే సెమీఫైనల్ ఆశలు గల్లంతే..