IPL 2022, Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో హసరంగా ఔట్.. విజేతగా నిలిచిన రాజస్థాన్ బౌలర్..

IPL 2022, Purple Cap: రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆర్సీబీకి చెందిన వనిందు హసరంగా వికెట్ తీసి పర్పుల్ క్యాప్ రేసును ఆసక్తికరంగా మార్చాడు. ఫైనల్‌కు ముందు చాహల్, హసరంగ మధ్య ఒకే ఒక్క వికెట్ తేడా ఉంది.

IPL 2022, Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో హసరంగా ఔట్.. విజేతగా నిలిచిన రాజస్థాన్ బౌలర్..
Yuzvendra Chahal Wins Ipl 2022 Purple Cap
Follow us

|

Updated on: May 30, 2022 | 5:40 AM

ఐపీఎల్ 15వ సీజన్‌లో భారత బౌలర్ అత్యధిక వికెట్ల రేసులో అగ్రస్థానంలో నిలవడమే కాదు.. పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్ఆర్ బౌలర్ ఈ అద్భుతం చేశాడు. ఈ సీజన్‌లో బౌలర్లు చివరి క్షణంలో మ్యాచ్‌ను మార్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ కారణంగా, పర్పుల్ క్యాప్ రేసు చాలా ఉత్కంఠగా సాగింది. అయితే, చివరికి ఈ టోపీని యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తన పేరుతో అంటిపెట్టుకున్నాడు. చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ని అందుకున్నాడు. మరోవైపు, ఊహించినట్లుగానే, ఆరెంజ్ క్యాప్‌కు రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్ ఓనర్‌గా నిలిచాడు.

ప్లేఆఫ్ మ్యాచ్‌ల సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగా మధ్య పోటీ జరిగింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు, ఈ సీజన్‌లో ఇద్దరు స్పిన్నర్ల ఖాతాలో తలో 26 వికెట్లు ఉన్నప్పటికీ, హసరంగ అగ్రస్థానంలో నిలిచాడు. పర్పుల్ క్యాప్‌ని అందుకోవడానికి చాహల్‌కు చివరి మ్యాచ్‌లో ఒక వికెట్ అవసరం. అయితే రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లోనూ చాహల్ ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అది అంత సులువు కాలేదు.

లీగ్‌లో చాహల్ ఎక్కువ సమయం టాప్‌లోనే..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో బౌలర్లకు పర్పుల్ క్యాప్ అతిపెద్ద బహుమతి. తన జట్టును టైటిల్ గెలవడమే కాకుండా, ప్రతి బౌలర్ ఈ క్యాప్ గెలవాలని కలలు కంటాడు. ప్రతి మ్యాచ్ తర్వాత, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న బౌలర్‌ను అర్హులుగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం లీగ్‌లో 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటున్నాయి. కాబట్టి పర్పుల్ క్యాప్ రేస్ చాలా ఉత్కంఠగా సాగింది. సీజన్ ప్రారంభంలో ఉమేష్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, చాహల్ వెంటనే అతనిని వెనక్కి పంపాడు.

చాహల్ పేరు మీదే పర్పుల్ క్యాప్..

ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చాహల్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే గత మ్యాచ్‌ల్లో అతని ఆటతీరు కనిపించకపోవడంతో వనిందు హసరంగ రేసులోకి దూసుకొచ్చాడు. హసరంగ జట్టు RCB ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 16 మ్యాచుల్లో 26 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఫైనల్లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్ తీసిన చాహల్.. హసరంగను వెనక్కు నెట్టి పర్పుల్ క్యాప్ రేసులో విజేతగా నిలిచాడు.

చాహల్ రికార్డులు..

పర్పుల్ క్యాప్ గెలవడంతో పాటు చాహల్ కూడా ఒకేసారి రెండు రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చాహల్ నిలిచాడు. ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున పర్పుల్ క్యాప్ గెలిచిన తొలి స్పిన్నర్‌గా కూడా చాహల్ నిలిచాడు.

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..