- Telugu News Photo Gallery Cricket photos GT vs RR, IPL 2022 Final: Hardik Pandya's Gujarat titans team ipl 2022 champion 5 heroes of gt victory
IPL 2022 Final: గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా మార్చిన ఐదుగురు హీరోలు వీరే.. లిస్టులో ఎవరున్నారంటే?
గుజరాత్ ఈ టైటిల్ విజయంలో పలువురు ఆటగాళ్లు సహకరించారు. టోర్నీ అంతటా మంచి ప్రదర్శనను కొనసాగించి, చివరికి జట్టును చాంపియన్‌గా నిలబెట్టిన ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: May 30, 2022 | 5:15 AM

ఐపీఎల్‌లో తరచుగా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇదే వరుస 15వ సీజన్‌లోనూ కనిపించింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గుజరాత్ ఈ టైటిల్ విజయంలో పలువురు ఆటగాళ్లు సహకరించారు. టోర్నీ అంతటా మంచి ప్రదర్శనను కొనసాగించి, చివరికి జట్టును చాంపియన్‌గా నిలబెట్టిన ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ టైటాన్స్ విజయంలో హార్దిక్ పాండ్యా బిగ్గెస్ట్ హీరోగా నిలిచాడు. కెప్టెన్ పాండ్యా 15 మ్యాచ్‌ల్లో 44.27 సగటుతో 487 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. దీంతో పాటు పాండ్యా 8 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అతని కెప్టెన్సీ కూడా అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇది గుజరాత్‌ను ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించింది.

గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంలో మరో కీలక హీరో డేవిడ్ మిల్లర్. గుజరాత్ మిల్లర్‌ను మ్యాచ్ ఫినిషర్‌గా ఉపయోగించుకుంది. ఈ ఆటగాడు 67.42 సగటుతో 472 పరుగులు చేశాడు. మిల్లర్ స్ట్రైక్ రేట్ కూడా 140 కంటే ఎక్కువగా ఉంది.

గుజరాత్ టైటాన్స్ విజయంలో మూడో హీరో శుభమాన్ గిల్ నిలిచాడు. గిల్ 16 మ్యాచ్‌ల్లో 33.92 సగటుతో 475 పరుగులు చేశాడు. ఈ బ్యాట్స్‌మన్ 4 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ 130 కంటే ఎక్కువగా ఉంది. గిల్ ఒక మ్యాచ్‌లో సెంచరీని కేవలం 4 పరుగులతో తేడాతో కోల్పోయాడు.

గుజరాత్ టైటాన్స్ విజయంలో నాల్గవ హీరోగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిలిచాడు. ఈ బౌలర్ 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో షమీ 11 వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థి జట్లను బ్యాక్‌ఫుట్‌లో ఉంచింది.

గుజరాత్ టైటాన్స్ విజయంలో ఐదో కీలక ప్లేయర్‌గా వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ నిలిచాడు. ఈ బౌలర్ 19 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 7 పరుగుల కంటే తక్కువగా ఉంది. రషీద్ లైన్ లెంగ్త్ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టడంతో గుజరాత్ ఇతర బౌలర్లు లాభపడ్డారు.




