IPL 2021: వార్నర్ రీ-ఎంట్రీ.. సన్‌రైజర్స్ జయభేరి మొదలయ్యేనా.! నేడే ఢిల్లీతో కీలక పోరు..

IPL 2021, SRH Vs DC: ఐపీఎల్ రెండో దశలో ఇవాళ కీలక పోరుకు తెరలేవనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్..

IPL 2021: వార్నర్ రీ-ఎంట్రీ.. సన్‌రైజర్స్ జయభేరి మొదలయ్యేనా.! నేడే ఢిల్లీతో కీలక పోరు..
Sunrisers
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:15 PM

ఐపీఎల్ రెండో దశలో ఇవాళ కీలక పోరుకు తెరలేవనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల బలాబలాల గురించి చర్చించుకుంటే.. రెండింటిలోనూ ధీటైన బ్యాట్స్‌మెన్లు, బలమైన మిడిల్ ఆర్డర్.. అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వచ్చేసరికి బలాబలాల గురించి కంటే.. వార్నర్ గురించే చర్చ బాగా జరుగుతోంది.

సన్‌రైజర్స్ జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు డేవిడ్ వార్నర్. ఆ జట్టుకు అతడే అత్యధిక స్కోరర్‌గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అలాగే తనదైన శైలి కెప్టెన్సీతో సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు అనూహ్యంగా ఈ ఏడాది కెప్టెన్సీని కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఇక కనిపించడు అని ఊహాగానాలు వినిపించాయి. అయితే కరోనా రావడం ఐపీఎల్ వాయిదా పడటంతో సమీకరణాలు మారిపోయాయి.

ఇదిలా ఉంటే ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో దూరం కావడంతో.. సన్ రైజర్స్ జట్టుకు మరోసారి డేవిడ్ వార్నర్ పెద్ద దిక్కుగా మారాడు. జట్టును ముందుంది నడిపించేందుకు ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగబోతున్నాడు. మరి ఈ అవకాశాన్ని డేవిడ్ భాయ్ ఎంతవరకు వినియోగించుకుంటాడో వేచి చూడాలి. అటు రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్ కూడా హైదరాబాద్ జట్టుకు కీలకం కానున్నారు.

మరోవైపు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి తిరిగి రావడం, అక్షర్ పటేల్ కూడా అందుబాటులో ఉండటంతో ఆ జట్టుకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. దుబాయ్ స్టేడియంలో పక్కా థ్రిల్లర్ మ్యాచ్‌ను ప్రేక్షకులు తిలకించబోతారని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌తో సన్ రైజర్స్ జయభేరి మొదలవుతుందని ఆశిద్దాం..

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!