AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ ఖాళీ అయింది. జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. బుమ్రాకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. విరాట్ కోహ్లీని కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశం లేకపోలేదు.

రోహిత్‌ రిటైర్మెంట్‌.. ఇక టీమిండియా కెప్టెన్సీ అతనికే..? ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తాడుగా..
Rohit Sharma
SN Pasha
|

Updated on: May 07, 2025 | 8:05 PM

Share

ఐపీఎల్‌ 2025 మధ్యలో రోహిత్‌ శర్మ టెస్ట్‌ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఇప్పుడు భారత టెస్టు జట్టు కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ, న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో ఓడిపోవడంతో రోహిత్‌ కెప్టెన్సీకి ప్రమాదం వచ్చింది. ఐపీఎల్‌ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. సో.. ఈ సిరీస్‌ కంటే ముందు జట్టును ఎంపిక చేసే క్రమంలో.. రోహిత్‌ కెప్టెన్సీపై సెలెక్టర్లు అతని మాట్లాడినట్లు తెలుస్తోంది.

కెప్టెన్సీ వదిలేయాలని సెలెక్టర్లు కోరడంతో, కెప్టెన్సీతో పాటు ఇక టీమ్‌లో ఉండటం కూడా కష్టమే అని భావించిన రోహిత్‌ ఏకంగా టెస్ట్‌ ఫార్మాట్‌కే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మరి రోహిత్‌ తర్వాత రాబోయే ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో భారత జట్టును నడిపించే అవకాశం జస్ప్రీత్‌ బుమ్రా లేదా శుబ్‌మన్‌ గిల్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. ఎక్కువగా అయితే బుమ్రాకే అవకాశం ఉంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో అతని కెప్టెన్సీలో టీమిండియా ఒక మ్యాచ్‌ కూడా గెలిచిన విషయం తెలిసిందే. గాయాల పాలు కాకుండా ఉంటే.. టెస్ట్‌ ఫార్మాట్‌లో బుమ్రా టీమిండియా కెప్టెన్‌ అయ్యే ఛాన్స్‌ ఎక్కవగా కనిపిస్తోంది. మరి టెస్ట్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గా అదిరిపోయే రికార్డ్‌ ఉన్న విరాట్‌ కోహ్లీని కూడా సెలెక్టర్లు మరోసారి సంప్రదించే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ ఎవర్ని నియమిస్తుందో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సామాన్యులకు పండగే.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!
సామాన్యులకు పండగే.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!
కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి
కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి
ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!
గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!
ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??
ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??
ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం
హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం
సింహాచలంలో 'డిజిటల్' దర్శనం: క్యూలైన్లకు చెక్..
సింహాచలంలో 'డిజిటల్' దర్శనం: క్యూలైన్లకు చెక్..
తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు
తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు
నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే