Yash Dayal : యశ్ దయాల్ కేసులో నేడు కీలక తీర్పు.. అరెస్టు తప్పదా ? తన కెరీర్ ఇక క్లోజ్ అయినట్లేనా ?
భారత క్రికెటర్ యశ్ దయాల్ క్రికెట్ పిచ్‌కన్నా కోర్టు గదుల్లో జరిగే పోరాటం వల్ల ఎక్కువ వార్తల్లో నిలిచారు. ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై అలహాబాద్ హైకోర్టులో ఈరోజు కీలక విచారణ జరగనుంది.

Yash Dayal : క్రికెటర్ యశ్ దయాల్ ఇప్పుడు క్రికెట్ పిచ్‌పై కాకుండా కోర్టులో పోరాడుతున్నారు. ఆయనపై ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై ఈరోజు అలహాబాద్ హైకోర్టులో ముఖ్యమైన విచారణ జరగనుంది. యశ్ దయాల్ అరెస్టుపై ఉన్న స్టే కొనసాగుతుందా లేదా ఈ కేసు ముందుకు వెళుతుందా అనేది ఈ విచారణలో తేలనుంది.
గతంలో జూలై 15న అలహాబాద్ హైకోర్టు యశ్ దయాల్‌కు తాత్కాలిక ఊరట కల్పించింది. కేసుపై పూర్తి విచారణ అయ్యే వరకు ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా కోర్టు బాధితురాలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక పోలీస్ స్టేషన్‌లకు నోటీసులు పంపింది.
జూలై 6న యశ్ దయాల్‌పై ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి యశ్ దయాల్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనపై చేసిన ఆరోపణలు అబద్ధమని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ కేసు పెట్టారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ కేసును అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు విచారిస్తుంది. జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అబ్దుల్ షాహిద్తో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తుంది. యశ్ దయాల్‌కు ఈ విచారణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కేసు ఆయన ప్రతిష్ట, క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




