India vs England Test: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడేనా? తేల్చనున్న ఇంగ్లండ్ టీం..

జులై 1 నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల కళ్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఇక్కడ టీమ్ ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై కూడా కన్ను వేసింది.

India vs England Test: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడేనా? తేల్చనున్న ఇంగ్లండ్ టీం..
Ind Vs Eng Test
Follow us

|

Updated on: Jun 30, 2022 | 5:34 PM

ఐర్లాండ్‌తో భారత్ సిరీస్ ముగిసింది. ప్రస్తుతం అందరి చూపు ఇంగ్లండ్‌తో జులై 1 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ భారత్‌కు అనేక విధాలుగా కీలకమైందిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలవడం లేదా డ్రా చేసుకోవడం వల్ల భారత్ సిరీస్ విజయం చారిత్రాత్మకంగా మారనుంది. కానీ, ఈ టెస్ట్ మ్యాచ్ మరొక కారణంతోనూ టీమిండియాకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ నుంచి టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకునే మార్గం నిర్ణయించనుంది. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుండగా ఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయి. అయితే ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడిందంటే? పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?

2021-23 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో 6 గెలిచింది. 3 ఓడింది. కాగా, రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్‌కు మొత్తం 77 పాయింట్లు ఉండగా, విజయాల శాతం 58.33గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఫైనల్స్‌కు చేరాలంటే?

ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇంకా 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఒకటి ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోనే జరగనున్నాయి. భారత్ ఈ మ్యాచ్‌లు గెలిస్తే, అప్పుడు విజయాల శాతం ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా ఉంటుంది.

భారత్ 7లో 6 గెలిస్తే, భారత్ గెలుపు శాతం దాదాపు 70 శాతం ఉంటుంది. రెండు టెస్టులు ఓడిపోతే భారత్ విజయ శాతం 65 శాతానికి దిగువకు పడిపోతుంది. అంటే, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ ఓడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. తద్వారా దాని విజయ శాతంపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉంటుంది.

ఫైనల్‌లో పోరు?

టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ప్రస్తుతం టాప్-2లో ఉన్న జట్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా. నిబంధనల ప్రకారం గెలుపు శాతం ఆధారంగా అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అంటే, ఈ జట్ల కంటే ముందు టీమ్ ఇండియా తన విజయ శాతాన్ని పెంచుకోవాల్సి ఉంది.

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్ 4-0తో గెలిస్తే, దాని విజయ శాతం పెరుగుతుంది. ఆస్ట్రేలియా ఓటమి చవిచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ టాప్-2కి చేరుకుంటే దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో ఢీకొనే ఛాన్స్ ఉంటుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు