IND vs SL Playing 11: టాస్ గెలిచిన భారత్.. అరంగేట్రం చేసిన త్రిపాఠి.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
India vs Sri Lanka 2nd T20I: తొలి టీ20లో ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటుంటే, టీమిండియా మాత్రం సిరీస్‌ను గెలుచుకోవాలని ఆరాటపడుతోంది.

India vs Sri Lanka: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ పుణెలో ప్రారంభమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక టీం మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే శ్రీలంకతో జరిగే నాలుగో ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో కైవసం చేసుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇచ్చాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేష్ శర్మను బోర్డు జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.




రెండు దేశాల మధ్య మొత్తం 27 టీ20లు జరిగాయి. భారత్ 18, శ్రీలంక 8 గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. భారత్‌లో టీ20 మ్యాచ్‌ల గురించి మాట్లాడితే, ఇరు జట్లు 15 సార్లు తలపడ్డాయి. భారత్ 12, శ్రీలంక 2 గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ఇరు జట్లు..
భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక
టీమిండియా క్యాప్ అందుకున్న రాహుల్ త్రిపాఠి..
Congratulations to Rahul Tripathi who is all set to make his T20I debut for #TeamIndia ???#INDvSL @mastercardindia pic.twitter.com/VX1y83nOsD
— BCCI (@BCCI) January 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
