On This Day: ఆటగాళ్ల పాలిట యుముడిలా మారిన పిచ్.. దెబ్బకు క్రికెటర్ల కాళ్లు, చేతులు విరిగిపోయాయ్..
దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా (ప్రస్తుతం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం) మైదానానికి ఎంతో పేరు ఉంది. పలు చారిత్రక మ్యాచ్‌లు ఈ గ్రౌండ్‌లో జరిగాయి. పాకిస్థాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసిన ఘనత కూడా ఇదే మైదానంలోనే.

దేశ రాజధాని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా (ప్రస్తుతం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం) మైదానానికి ఎంతో పేరు ఉంది. పలు చారిత్రక మ్యాచ్‌లు ఈ గ్రౌండ్‌లో జరిగాయి. పాకిస్థాన్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసిన ఘనత కూడా ఇదే మైదానంలోనే. పలువురు టీమిండియా క్రికెటర్లకు ఈ మైదానం ఒక మరుపురాని జ్ఞాపకం . అయితే 13 ఏళ్ల క్రితం ఈ మైదానంలో జరిగిన సంఘటన భారత క్రికెట్‌ను సిగ్గుపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అది 27 డిసెంబర్ 2009. వన్డే మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు కోట్లా స్డేడియానికి వచ్చాయి. అప్పటికే అభిమానుల ఈలలు, కేకలతో స్టేడియం మొత్తం సందడిగా కనిపించింది. భారతదేశం, శ్రీలంక రెండు జట్లు కూడా మైదానంలో అడుగుపెట్టాయి. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగగా.. టీమిండియా బౌలర్లు బంతిని అందుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ బంతి ఎవరి అంచనాలకు అందడం లేదు. బౌలర్లు ఎంత నియంత్రణలో బంతిని విసురుతున్నా సరే విచిత్రమైన రీతిలో దూసుకుపోతోంది. శ్రీలంక బ్యాటర్ల కాళ్లు, చేతులకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా బంతిని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ సాగుతున్న కొద్దీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరు జట్లూ గ్రహించాయి.
ప్రమాదకరమైన పిచ్ స్వభావాన్ని చూసి 23.3 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను నిలిపివేశారు అంపైర్లు. అప్పటికే శ్రీలంక ఆటగాళ్ల మోచేతులు, భుజాలు, వేళ్లకు దెబ్బలు తగిలాయి. పిచ్‌ను చూస్తుంటే ఎవరో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్లు కనిపిస్తోందని, మధ్యలో ఖాళీని వదిలేసినట్లుగా ఉందని టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. దీని కారణంగా, BCCI గ్రౌండ్, వికెట్ కమిటీలు రద్దు చేయబడ్డాయి. సాధారణంగా ఇలాంటి పిచ్‌లను కొంత కాలం పాటు నిషేధిస్తారు. అయితే, 2011 ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లు ఇక్కడే నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ తొలి బంతికే ఓపెనర్ ఉపుల్ తరంగను బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఆశిష్ నెహ్రా వేసిన బంతికి తిలరత్నే దిల్షాన్ మోచేతికి తగిలింది. సనత్ జయసూర్యకు కూడా పలుచోట్ల దెబ్బలు తగిలాయి.




మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..