Team India: 3 ఫార్మాట్లు, ముగ్గురు కెప్టెన్లు.. కొత్త ఏడాదిలో సరికొత్తగా టీమిండియా.. బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళిక ఇదే..
Indian Cricket Team: టీ20 ప్రపంచ కప్ తర్వాత బీసీసీఐ టీమిండియాలో కీలక మార్పులు చేపట్టింది. కొత్త ఏడాదిలో సరికొత్తగా టీమిండియా ముందుకు దూసుకపోతుందని ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడు.

Indian Cricket Team: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. టీ20, వన్డే జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 టీమ్‌లో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వగా, సూర్యకుమార్ యాదవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ సిరీస్‌తో పాటు బీసీసీఐ తన ఉద్దేశాన్ని దాదాపుగా స్పష్టం చేసినట్లైంది. వన్డే జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పునరాగమనం కనిపించింది. అలాగే వన్డే జట్టు నుంచి ధావన్ ఔటయ్యాడు. ఇలా ఎన్నో మార్పులతో రెండు ఫార్మాట్లకు స్వ్కాడ్‌లను బీసీసీఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్‌నకు ముందు, ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టుకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రపంచ కప్ తర్వాత, అతను న్యూజిలాండ్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గాను పనిచేశాడు. తాజాగా శ్రీలంక సిరీస్‌కు కూడా బాధ్యతలు చేపట్టాడు.
హార్దిక్‌కు వరుసగా లభిస్తున్న అవకాశాలు టీ20 జట్టులో మార్పు దిశగా బోర్డు కదులుతున్నట్లు సూచిస్తున్నాయి. శ్రీలంకతో సిరీస్ కోసం చాలామంది యువకులకు అవకాశం దక్కింది. దీంతో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ కోసం పూర్తిగా భిన్నమైన జట్టును సిద్ధం చేస్తుందని నిరూపణ అయ్యింది.




ఈ ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. రోహిత్ శర్మ ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత జట్టులో మార్పులు చేయడానికి హార్దిక్‌ను జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు.
శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు జట్టులో చోటు కల్పించడం ద్వారా బోర్డు యువ ప్రతిభకు పెద్దపీట వేసినట్లైంది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇంకా పూర్తి ఫిట్‌గా లేరు. కాబట్టి వారి జట్టులో చోటు దక్కలేదు. ఫిట్‌గా మారిన వెంటనే భారత జట్టులో చోటు దక్కించుకుంటారు.
ఇక టెస్ట్ జట్టుకు ప్రస్తుతం రోహిత సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, గాయాలతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కూడా ఈ బాధ్యతలు తీసుకుంటున్నాడు. కానీ, వీరిద్దరి తర్వాత ఎవరనేది దానిపైనా బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుమ్రా, అశ్విన్ ఇలా కొందరి పేర్లను మాజీలు సూచిస్తున్నారు. దీంతో 2023 నుంచి మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు ఉండనున్నట్లు భావిస్తున్నారు.
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా – హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పలెట్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం టీమిండియా – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..