100వ టెస్టుకు ముందు కోహ్లీ, సచిన్, ద్రవిడ్‌లలో ఎవరు బెస్ట్.. టీమిండియా టాప్ 7 బ్యాటర్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?

100వ టెస్టుకు ముందు కోహ్లీ, సచిన్, ద్రవిడ్‌లలో ఎవరు బెస్ట్.. టీమిండియా టాప్ 7 బ్యాటర్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే?
India Vs Sri Lanka Virat Kohli

Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్‌ని మొహాలీలో ఆడనున్నాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన 12వ భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Venkata Chari

|

Mar 04, 2022 | 8:38 AM

మొహాలీలో శ్రీలంకతో టీమ్ ఇండియా మొదటి టెస్ట్ (India vs Sri Lanka) ఆడటం ప్రారంభించిన వెంటనే, ఆ క్షణం విరాట్ కోహ్లీ (Virat Kohli 100th Test) జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటిగా నిలవనుంది. విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టుల్లో సెంచరీ పూర్తి చేయడమే అందుకు కారణం. మొహాలీలో విరాట్ కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. అతనికి ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్, ఇషాంత్ శర్మ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 11 మంది భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఈ దిగ్గజాల జాబితాలోకి విరాట్ కోహ్లీ చేరనున్నాడు.

విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్ అద్భుతంగా ఉంది. 99 టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాట్ 27 సెంచరీలు చేసింది. అతను 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ గణాంకాలు నిజంగా అద్భుతం. గత కొన్నేళ్లుగా కోహ్లి సగటు పడిపోయింది. 84 టెస్టుల తర్వాత, అతని బ్యాటింగ్ సగటు 54 కంటే ఎక్కువగా ఉంది. 99 టెస్టుల తర్వాత, ఇతర భారత బ్యాట్స్‌మెన్‌ల సగటు ఎంత, వారి బ్యాట్‌ ద్వారా ఎన్ని పరుగులు చేశారో ఇప్పుడు చూద్దాం..

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ 99 టెస్టుల తర్వాత 57.99 బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. అతని బ్యాట్‌తో 30 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. 99 టెస్టుల తర్వాత సచిన్ 8351 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్

99 టెస్టుల తర్వాత రాహుల్ ద్రవిడ్ సగటు అత్యధికంగా 58.16గా ఉంది. ఈ సమయంలో, ద్రవిడ్ బ్యాట్ నుంచి 8492 పరుగులు నమోదయ్యాయి. అయితే ద్రవిడ్ 22 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు చేశాడు.

సౌరవ్ గంగూలీ

99 టెస్టుల తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ సగటు 43.17గా ఉంది. అతను 6346 పరుగులు చేశాడు. గంగూలీ 15 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు సాధించాడు.

వీవీఎస్ లక్ష్మణ్

భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన వీవీఎస్ లక్ష్మణ్ 99 టెస్టుల తర్వాత 6313 పరుగులు చేశాడు. లక్ష్మణ్ బ్యాటింగ్ సగటు 45.41గా నిలిచింది. అతని బ్యాట్‌తో 13 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్

99 టెస్టుల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ సగటు కూడా 50గా ఉంది. సెహ్వాగ్ 50.84 సగటుతో 8,448 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సునీల్ గవాస్కర్

మాజీ కెప్టెన్, వెటరన్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 99 టెస్టుల తర్వాత 8394 పరుగులు చేశాడు. గవాస్కర్ బ్యాట్ 53.46 సగటుతో పరుగులు చేసింది. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.

దిలీప్ వెంగ్‌సర్కార్

దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా 99 టెస్టుల తర్వాత 46.21 సగటుతో 6331 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Also Read: Sachin – Kohli: పాజీ ఇక చాలు అంటూ కోహ్లీ.. నాటి ఇంట్రస్టింగ్ సీన్‌ను గుర్తు చేసిన సచిన్..

100వ టెస్ట్‌లో కోహ్లీ సెంచరీ చేయాలి.. డిమాండ్ చేస్తున్న మాజీ సొగసరి బ్యాట్స్‌మెన్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu