AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?

IND VS SL: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చారిత్రక విజయానికి చేరువైంది. 372 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను దెబ్బతీస్తూ 84 పరుగులకే 4 వికెట్లు పడగొట్టింది. అయితే ఐదో రోజు వర్షం పడి ఆట రద్దయితే మ్యాచ్ విజేత ఎవరు? ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయో చూద్దాం.

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది?
India Vs Sri Lanka
Rakesh
|

Updated on: Aug 19, 2026 | 9:34 AM

Share

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ ఆట రద్దయితే విజేత ఎవరు?

టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి.

ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి?

చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా?

గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

టీమిండియాకు వర్షమే పెద్ద శత్రువు

శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో లంకపై విరుచుకుపడ్డారు. గెలుపుకు కేవలం 6 వికెట్ల దూరంలో ఉన్న భారత్‌ను ఇప్పుడు శ్రీలంక బౌలర్లు లేదా బ్యాటర్లు కాదు, కేవలం గాళ్ మైదానంలో పడే వర్షం మాత్రమే అడ్డుకోగలదు. వాతావరణం సహకరించి రెండు సెషన్ల ఆట సాగినా భారత్ విజయం ఖాయం అవుతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us