IND vs SA: 35 ఓవర్ల వరకు ఆ బౌలర్‌కు ఛాన్స్ ఇవ్వకుంటే ఎలా: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
Shardul Thakur: భారత ఆల్ రౌండర్ శార్దూల్ 2వ టెస్టులో ది వాండరర్స్‌లో జరిగిన స్టెల్లార్ ఆల్-రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఇటు వికెట్లు, అటు పరుగులు సాధించి సత్తా చాటాడు.
India vs South Africa 2021-22: సెంచూరియన్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత బ్యాటర్లు ఆతిథ్య జట్టును సవాలు చేసేంత స్కోర్ చేయలేకపోవడంతో ఫలితం దక్షిణాఫ్రికా వైపు మారింది. దీంతో డీన్ ఎల్గర్ & కో సిరీస్‌ను 1-1తో సమం చేయగలిగారు.
రెండో టెస్టులో భారత్ నష్టపోయినప్పటికీ, కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు అలరించాయి. వారిలో ఒకరు శార్దూల్ ఠాకూర్ అనడంలో సందేహం లేదు. అతని మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఆల్-రౌండర్ 7/61తో దక్షిణాఫ్రికా జట్టును ద్వారా పెవిలియన్ చేర్చి, భారత్‌ను 27 పరుగుల స్వల్ప ఆధిక్యానికి చేర్చాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో, అతను 28 పరుగుల వేగవంతమైన ఆటతీరుతో ఆతిథ్య జట్టుకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడానికి సహాయం చేశాడు.
భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ, ‘శార్దూల్ 2 వ టెస్టుకు ఎంపికయ్యాడు. ఏది ఏమైనప్పటికీ, ది వాండరర్స్‌లో జరిగిన స్టెల్లార్ ఆల్-రౌండ్ షోను చూపించాడు’ అంటూ పేర్కొన్నాడు.
చోప్రా తన తాజా యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ, “శార్ధుల్ ఏడు వికెట్లు పడగొట్టినప్పుడు కూడా, మొదటి 35 ఓవర్లలో కేవలం ఒకసారి మాత్రమే బౌలింగ్ చేశాడు. కాబట్టి, 35 ఓవర్ల వరకు శార్దుల్‌ను పరిచయం చేయకపోవడం పెద్ద సమస్య. మొదటి, రెండు లేదా మూడు ఇన్నింగ్స్‌లలో పరుగులు సాధించలేకపోతే, జట్టులో మీ స్థానం ప్రశ్నార్థకమవుతుంది” అని చోప్రా అన్నారు.
“అయితే, శార్దుల్ స్ఫూర్తిదాయకమైన స్పెల్‌తో ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తి రేపాడు. అతను ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇది భారీ విజయం. ఆ తర్వాత, అతను బ్యాటింగ్‌తోనూ కీలకమైన 28 పరుగులు చేశాడు. దాని కారణంగా భారత్‌కు 239 పరుగుల ఆధిక్యం లభించింది. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, లార్డ్ ఠాకూర్ ఖచ్చితంగా అసాధారణమని” చోప్రా అభిప్రాయపడ్డారు.
IND vs SA: టీమిండియా ప్లేయింగ్ XIపై బిగ్ న్యూస్.. కేప్ టౌన్ టెస్ట్‌లో 2 కీలక మార్పులు?