Novak Djokovic: వీసా రద్దు కేసులో స్టార్ ప్లేయర్‌దే విజయం.. ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన కోర్టు..!
Australia vs Novak Djokovic: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై నొవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. నంబర్-1 టెన్నిస్ ప్లేయర్‌ను వెంటనే విడుదల చేయాలని, పాస్‌పోర్ట్ కూడా తిరిగి ఇవ్వాలని ఆస్ట్రేలియా సుప్రింకోర్టు తీర్పునిచ్చింది.
Australias vs Novak Djokovic: కరోనా నింబంధనల ఉల్లంఘన కారణంగా ఆస్ట్రేలియా, జకోవిచ్ వీసా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న వీసా అంగీకారానికి సంబంధించి మెల్‌బోర్న్ కోర్టులో వర్చువల్ విచారణ జరుగుతోంది. ఇది జకోవిచ్‌కు అనుకూలంగా మారింది. వీసా రద్దు నిర్ణయం అన్యాయమని న్యాయమూర్తి కెల్లీ గుర్తించారు. జకోవిచ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆదేశించారు. జకోవిచ్ పాస్‌పోర్ట్, ఇతర వ్యక్తిగత వస్తువులన్నీ అతనికి తిరిగి ఇవ్వాలని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 5.16 గంటలకు కోర్టులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా రద్దు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. 20 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్న ఆటగాడి పట్ల ఆస్ట్రేలియా ఇలా ప్రవర్తించడంతపై ప్రపంచ వ్యప్తంగానూ పలు విమర్శలు వచ్చాయి. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరుకుంటున్న నోవాక్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అడ్డుకుంది. వాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. అతని వీసా రద్దు చేసింది. స్వదేశమైన సెర్బియాకు వెళ్లాలంటూ ఆదేశించారు. దీనిపై సెర్బియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో కేసు వేశారు.
భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు కేసు విచారణ ప్రారంభమైంది. కొంత సమయం తర్వాత విచారణ చేసిన సుప్రింకోర్టు.. కేసు విచారణలో, న్యాయమూర్తి కెల్లీ అప్పీల్ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం నొవాక్ జకోవిచ్ మొత్తం సమాచారం అందించాడని పేర్కొన్నాడు. జకోవిచ్ ఓ వైద్య సమస్య గురించి ఒక ప్రొఫెసర్, డాక్టర్‌కి తెలియజేశాడు. కాబట్టి నిబంధనల ప్రకారం, ఇది సరిపోతుంది. నిబంధనలను ఉల్లంఘించే విషయానికి వస్తే, ముందస్తు మినహాయింపు పొందకపోతే అతను ఆస్ట్రేలియాకు వచ్చేవాడు కాదని నోవాక్ న్యాయవాది స్పష్టం చేశారు.
జొకోవిచ్ న్యాయవాదులు అతనిని ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. సెర్బియా ఆటగాడు గత నెలలో COVID-19 పాజిటివ్‌గా తేలాడు. ప్రస్తుతం దాని నుంచి కోలుకున్నాడు. దీని ఆధారంగా అతను ఆస్ట్రేలియా కఠినమైన టీకా నియమాల నుంచి వైద్య మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
నిబంధనల ప్రకారం టీకాలు వేసినా, తీసుకోకున్నా.. లేక మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే సమాచారం ఇవ్వాలని, అందులో వైద్యపరమైన సమస్య గురించి సమాచారం ఇచ్చామని నొవాక్ జకోవిచ్ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. దీనికి రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదని, అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తరపున నిలబడటం పూర్తిగా సరికాదంటూ వాదించారు.
The showdown has begun and is underway with a joke from Judge Anthony Kelly. The other players today are Nick Wood SC and Paul Holdenson QC for Novak Djokovic and Christpher Tran for Home Affairs Minister Karen Andrews (& the Comonwealth).
— Karen Sweeney (@karenlsweeney) January 9, 2022
#Breaking Judge Anthony Kelly has rule that Djokovic be released from immigration detention within in 30 minutes. He says the visa cancellation decision will be quashed and the government wil have to pay his costs.
— Karen Sweeney (@karenlsweeney) January 10, 2022
Also Read: IND vs SA: టీమిండియా ప్లేయింగ్ XIపై బిగ్ న్యూస్.. కేప్ టౌన్ టెస్ట్‌లో 2 కీలక మార్పులు?