AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Open 2022: ఓవైపు కోవిడ్ హోరు.. మరోవైపు బ్యాడ్మింటన్ పోరు.. నేటినుంచే ఇండియా ఓపెన్.. బరిలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు

నానాటికీ పెరుగుతున్న కోవిడ్-19 ముప్పు మధ్య, ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా..

India Open 2022: ఓవైపు కోవిడ్ హోరు.. మరోవైపు బ్యాడ్మింటన్ పోరు.. నేటినుంచే ఇండియా ఓపెన్.. బరిలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు
India Open;pv Sindhu
Venkata Chari
|

Updated on: Jan 11, 2022 | 7:05 AM

Share

India Open Badminton Tournament: నానాటికీ పెరుగుతున్న కోవిడ్-19 ముప్పు మధ్య, ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా, ఈ టోర్నమెంట్ ఇంతకు ముందు రెండుసార్లు రద్దు చేశారు. అయితే ఈసారి భారత్ ఈ ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని కోరుకుంటొంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu), కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) ఈ ఏడాదిలో పలు టోర్నమెంట్‌ను గెలుచుకున్నారు. గత సీజన్‌లో జోరును కొనసాగించి విజయం మరోసారి విజయం సాధించేందుకు రెడీ అయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచినప్పటి నుంచి సింధు ఏ టైటిల్‌ను గెలవలేదు. కొత్త సంవత్సరంలో కరువుకు ఈ టోర్నీతో స్వస్తి చెప్పాలనుకుంటోంది.

ఒమిక్రాన్ ముప్పు పెరుగుతుండడంతో.. ఈ టోర్నమెంట్‌ను కూడా కోవిడ్ చుట్టేసింది. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బి సాయి ప్రణీత్, డబుల్స్ ఆటగాడు ధృవ్ రావత్ టోర్నమెంట్‌కు బయలుదేరే ముందు కోవిడ్‌ పాజిటివ్ తేలడంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. ఐదో సీడ్ బి సుమీత్ రెడ్డితో జతకట్టిన పురుషుల డబుల్స్ ప్లేయర్ మను అత్రి కూడా సోమవారం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాలు సానుకూలంగా రావడంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మను వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, “నాకు దగ్గు వచ్చింది. నిన్న నా ఫలితం సానుకూలంగా వచ్చింది. ఈరోజు పోటీ నుంచి తప్పుకున్నాను. ఇది నా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, వచ్చే వారం సయ్యద్ మోదీ టోర్నీలో నేను ఆడగలనో లేదో చూడాలి.

చిరాగ్ శెట్టికి ఉపశమనం.. ఆదివారం జరిగిన పరీక్షలో పాజిటివ్‌గా గుర్తించిన తర్వాత, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ శెట్టి RT-PCR ఫలితం సోమవారం ప్రతికూలంగా వచ్చింది. ఆ తర్వాత అతను ఆడటానికి అవకాశం దొరికింది. చిరాగ్, అతని భాగస్వామి సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి రెండవ సీడ్‌లో ఉన్నారు. మొదటి రౌండ్‌లో స్వదేశీయులైన రవి, చిరాగ్ అరోరాతో తలపడతారు. కోవిడ్ ప్రమాదం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మొదటి టోర్నమెంట్ కోసం భారతదేశం, విదేశాల నుంచి చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు దేశ రాజధానికి చేరుకున్నారు.

ఈ ఆటగాళ్లపైనే కళ్లన్నీ.. సింధు, శ్రీకాంత్‌తో పాటు, కొత్త ప్రపంచ ఛాంపియన్ లోహ్ కీన్ యు, ఇండోనేషియా పురుషుల డబుల్స్ జంట మూడుసార్లు ఛాంపియన్ మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటియావాన్, మలేషియా అగ్రశ్రేణి క్రీడాకారులు ఒంగ్ యు సిన్, టియో ఇ యి ఇందిరాగాంధీ స్టేడియంలో సందడి చేయనున్నారు. ప్రేక్షకులు లేకుండా ఈ టోర్నీ జరగనుంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజతం, కాంస్య పతకాలను సాధించిన శ్రీకాంత్, లక్ష్య సేన్ వరుసగా దేశంలోని అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ భారత ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించనున్నారు.

సింధు గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శనను కొనసాగించింది. కాంస్య పతక రూపంలో తన రెండవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజత పతకంతో పాటు, ఆమె స్విస్ ఓపెన్‌లో ఫైనల్‌కు, కొన్ని టోర్నమెంట్‌లలో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది, కానీ, టైటిల్ గెలవలేకపోయింది. ఐదేళ్ల క్రితం 2017లో ఇక్కడ టైటిల్ నెగ్గిన హైదరాబాద్‌కు చెందిన సింధు.. మరోసారి ఇండియా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోవాలని భావిస్తోంది. సింధు తన దేశానికి చెందిన శ్రీకృష్ణ ప్రియా కుదరవల్లిపై తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. అయితే ఆమె చివరి ఎనిమిదిలో రష్యాకు చెందిన ఐదో సీడ్ యెవ్జెనియా కొసెట్స్కాయతో తలపడవచ్చు.

సైనా నెహ్వాల్ ఆకట్టుకుంటుందా.. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్, థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్, సింగపూర్‌కు చెందిన జియా మిన్ యెయో టాప్ ప్లేయర్‌లు. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, నాలుగో సీడ్‌ సైనా గాయాలతో బాధపడుతోంది. క్వార్టర్‌ఫైనల్లో అమెరికాకు చెందిన ఏడో సీడ్ ఐరిస్ వాంగ్‌తో, సెమీఫైనల్లో రెండో సీడ్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌తో తలపడే అవకాశం ఉంది.

శ్రీకాంత్ స్వదేశీ ఆటగాడితో.. పురుషుల సింగిల్స్‌లో, శ్రీకాంత్ స్వదేశీయుడైన సిరిల్ వర్మతో తన ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్‌లో తనను ఓడించిన సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో సెమీ-ఫైనల్‌లో తలపడవచ్చు. ఫామ్‌లో ఉన్న లక్ష్య, మొదటి రౌండ్‌లో ఈజిప్ట్‌కు చెందిన అధమ్ ఎల్గామల్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్‌లో స్వదేశీయుడు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనలిస్ట్ ప్రణయ్‌తో తలపడవచ్చు. కోవిడ్ ప్రభావంతో పోరాడి తిరిగి వస్తున్న ప్రణయ్ తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో అబియన్‌తో తలపడనున్నాడు. ఆరో సీడ్ సమీర్ వర్మ తన అన్నయ్య సౌరభ్‌పై తన ప్రచారాన్ని ప్రారంభించనున్నాడు.

ఫ్రాన్స్, రష్యా, కెనడా, ఇంగ్లండ్‌లకు చెందిన ఆటగాళ్లు వైదొలగడంతో టోర్నీ కాస్త మెరుపును కోల్పోయింది. శుక్రవారం ఢిల్లీకి బయలుదేరే ముందు డబుల్స్ స్పెషలిస్ట్ సీన్ వెండీ, కోచ్ నాథన్ రాబర్ట్‌సన్ పాజిటివ్ పరీక్షించడంతో మొత్తం ఇంగ్లాండ్ జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) టోర్నమెంట్ మ్యాచ్ అధికారులు, BWF, BAI అధికారులు, సహాయక సిబ్బంది, విక్రేతలు, ఇతర ఆటగాళ్లతో పాటు ప్రతి ఒక్కరు స్టేడియం వెలుపల COVID పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ టెస్టులు చేయనున్నారు. నెగిటివ్‌గా తేలితేనే లోపలికి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Also Read: Watch Video: కోహ్లీ ప్రాక్టీస్‌తో కలత చెందిన ఫ్యాన్స్.. ఈ ఒక్కసారికి అలా చేయోద్దంటూ విజ్ఞప్తి..!

IPL 2022 Mega Auction: ఐపీఎల్ స్టార్లు ఆ రెండు జట్లలోనే.. అహ్మదాబాద్ కెప్టెన్‌గా కోహ్లి ఫ్రెండ్.!