IND vs SA: టీమిండియా ప్లేయింగ్ XIపై బిగ్ న్యూస్.. కేప్ టౌన్ టెస్ట్‌లో 2 కీలక మార్పులు?

భారతదేశం వర్సెస్ దక్షిణాఫ్రికా ప్రయాణం కేప్ టౌన్‌కు చేరుకుంది. ఇక్కడ సిరీస్‌లోని చివరి లేదా నిర్ణయాత్మక టెస్ట్ ఆడబోతోంది.

IND vs SA: టీమిండియా ప్లేయింగ్ XIపై బిగ్ న్యూస్.. కేప్ టౌన్ టెస్ట్‌లో 2 కీలక మార్పులు?
India Vs South Africa
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2022 | 12:13 PM

India vs South Africa: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India Vs South Africa) టెస్ట్ సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రెండు జట్ల ప్రయాణం కేప్ టౌన్‌‌కు చేరుకుంది. ఇక్కడ సిరీస్‌లోని చివరి లేదా నిర్ణయాత్మక టెస్ట్ ఆడబోతోంది. దక్షిణాఫ్రికాలో తన చరిత్రను మార్చుకోవాలంటే భారత్ ఈ టెస్టులో తప్పక గెలవాలి. దక్షిణాఫ్రికా జట్టు రికార్డు ఈ గ్రౌండ్‌లో అద్భుతంగా ఉండడంతో భారత్ ఈ మ్యాచులో చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతటి కీలక మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ పెద్ద వార్త వెలువడుతోంది .

కేప్ టౌన్ టెస్టు కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఈ మార్పులు జట్టులోని మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌కు సంబంధించినవి. జట్టులో జరుగుతున్న ఈ రెండు మార్పులతో టీమిండియా ప్రమాదంలో పడనుంది. గాయాల నుంచి కోలుకున్న ఒక ఆటగాడు కేప్ టౌన్ టెస్ట్ ప్లేయింగ్ XIలో ఉంటాడు. మరొకరు అతని కారణంగా ఔట్ కానున్నాడు.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో 2 మార్పులు! ప్రస్తుతం ఊహాగానాలలో ఉన్న జట్టులో జరగబోయే రెండు మార్పులను ఒక్కసారి చూద్దాం. జట్టులో మొదటి మార్పు విరాట్ కోహ్లి గాయం నుంచి తిరిగి రానున్నాడు. విరాట్ జట్టులో ఉండటంతో హనుమ విహారి ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. వెన్ను నొప్పి కారణంగా జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ను విరాట్ ఆడలేకపోయాడు.

జట్టులో రెండవ మార్పు బౌలింగ్ ముందు ఉంటుంది. ఇక్కడ జట్టులో మహమ్మద్ సిరాజ్ స్థానాన్ని ఇషాంత్ శర్మ పొందవచ్చు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో సిరాజ్ గాయపడ్డాడు. ఈ కారణంగా అతను కేప్ టౌన్ టెస్టుకు దూరమయ్యాడు. ఇషాంత్‌కు 100కి పైగా టెస్టులు ఆడి 300లకు పైగా వికెట్లు తీసిన అనుభవం ఉందని, ఇది కేప్‌టౌన్‌లో టీమిండియాకు ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది.

కేప్ టౌన్ టెస్టుకు భారత ప్రాబబుల్ XI: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్, ఆర్. అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ

Also Read: Ravindra Jadeja: కేకేఆర్‌ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎస్‌కే ఆల్‌రౌండర్.. ధోనీ ఫ్యాన్స్ కూడా ఫైర్.. ఎందుకంటే?

WTC Points Table: సిడ్నీ టెస్ట్‌ ఎఫెక్ట్.. అగ్రస్థానం కోల్పోయిన ఆసీస్.. టీమిండియా ఏ ప్లేస్‌లో ఉందంటే?