IND vs SA: బౌన్సర్లతో రెచ్చిపోయిన మార్కో జాన్సన్.. కోపంగా చూసిన బుమ్రా ఏం చేశాడంటే..
జోహన్నెస్‌బర్గ్ టెస్టు మూడో రోజు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సన్ వాగ్వాదానికి దిగారు...
జోహన్నెస్‌బర్గ్ టెస్టు మూడో రోజు భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సన్ వాగ్వాదానికి దిగారు. మార్కో జాన్సన్‌కు ఇది రెండో టెస్ట్ మాత్రమే. ఈ ఇద్దరు ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. వీరి వాగ్వాదానికి బౌన్సర్లు కారణమయ్యాయి. 54వ ఓవర్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సన్ బుమ్రాకు బౌన్సర్ బాల్స్ అదే పనిగా వేశాడు. జాన్సన్ వేసిన మూడో బంతి బుమ్రా భుజానికి తగిలింది. దీని తర్వాత, జాన్సన్ కూడా నాల్గో బంతికి బౌన్సర్ చేశాడు. దీంతూ బుమ్రా యాన్సన్ బుమ్రా వైపు కోపంగా చూశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
యాన్సన్ తన రన్-అప్ వైపు వెళుతున్నప్పుడు, బుమ్రా ముందుకు వెళ్లి అతనితో ఏదో అన్నాడు. తరువాత జాన్సన్, బుమ్రా ఒకరికొకరు దగ్గరకు వచ్చారు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కాస్త దూకుడుగా ఉండడంతో అంపైర్ జోక్యం చేసుకున్నాడు. జాన్సన్ ఓవర్ తర్వాత, రబడ కూడా బుమ్రాకు బౌన్సర్‌ను బౌల్స్ వేశాడు. బుమ్రా బౌన్సర్‌ను అద్భుతమైన సిక్స్ కొట్టాడు. బుమ్రా సిక్స్‌ను చూసిన భారత జట్టు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. దీని తర్వాత, బుమ్రా రబాడను సైగలలో బౌన్సర్‌ను విసరమని హెచ్చరించాడు. అయితే 7 పరుగులు మాత్రమే చేసిన జస్ప్రీత్ బుమ్రా.. లుంగీ ఎగిండి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మార్కో జాన్సన్ అతని క్యాచ్ పట్టాడు.
Read Also.. IND vs SA : మూడోరోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 8 వికెట్లు.. సౌతాఫ్రికాకి 122 పరుగులు..