India vs Pakistan: భారత్-పాకిస్థాన్ జట్ల ఆందోళనను పెంచిన దక్షిణాఫ్రికా.. కారణం ఏంటంటే?
India vs Pakistan: టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మొత్తం 7 సార్లు తలపడ్డాయి. టీమ్ ఇండియా 5 సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టై మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్‌తో విజయం సాధించింది.
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్‌లో , సాంప్రదాయ ప్రత్యర్థులు భారత్ వర్సెస్ పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆందోళన మొదలవడానికి కారణం దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన.
దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ శనివారం నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించే సౌతాఫ్రికా జట్టు కూడా పరుగులు చేయడంలో ఇబ్బంది పడడం ఆశ్చర్యం కలిగించింది. బలమైన బ్యాట్స్‌మెన్స్ ఉన్న దక్షిణాఫ్రికా జట్టు పవర్‌ప్లేలో 16 పరుగులు మాత్రమే చేసింది.
104 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి 18.5 ఓవర్లు పట్టింది. తుఫాన్ బ్యాటర్‌గా పేరుగాంచిన డేవిడ్ మిల్లర్ విన్యాసాల వల్లే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించిందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ అజేయంగా 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, ఈ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌కు సరిగ్గా 51 బంతులు పట్టడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.
అంటే తుఫాన్ స్ట్రైకర్‌గా పేరొందిన డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇండో-పాక్ మ్యాచ్‌పై ఆందోళన?
పటిష్ట బ్యాట్స్‌మెన్‌తో కూడిన దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన మైదానంలోనే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడిందని, ఈసారి కూడా బ్యాటింగ్ కష్టమేనని రోహిత్ శర్మ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు నసావ్ మైదానం పిచ్‌లో కొన్ని మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ, శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేయడంలో తడబడినట్లు కనిపించింది. అందుకే భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌లో బ్యాటర్ల నుంచి స్పీడ్‌ను ఆశించలేం.
అందువల్ల, నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో భారీ స్కోర్లు చేసే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా క్రీజులో నిలబడి ఆడాల్సిన అవసరం భారత్, పాక్ జట్ల బ్యాట్స్ మెన్స్ ముందున్న పెద్ద టార్గెట్‌గా నిలిచింది. కాబట్టి ఓపికగా బ్యాటింగ్ చేసే జట్టు నసావు స్టేడియంలో విజయ పతాకాన్ని ఎగురవేయడానికి ఎదురుచూడవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..