World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్
ICC ODI World Cup 2023: ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారత క్రికెట్ జట్టు తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను 9 వేర్వేరు నగరాల్లో ఆడనున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో చెన్నైలో, రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరగనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19న పూణె మైదానంలో, ఐదో మ్యాచ్ న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22న ధర్మశాలలోని అందమైన మైదానంలో జరగనుంది.

ICC ODI World Cup 2023: వచ్చే ప్రపంచకప్‌పై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ భారీ జోస్యం చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ 2023లో ఏ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆడవచ్చో చెప్పేశాడు. శ్రీశాంత్ ప్రకారం, ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగవచ్చని ప్రకటించాడు. ఎస్ శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 2019 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు శ్రీలంకను 50 పరుగులకు ఆలౌట్ చేసినట్లే ఈ మ్యాచ్‌లతోనూ జరుగుతుందని అనుకుంటున్నాను. నేను చాలా సానుకూలంగా ఉన్నాను. భారతీయ అభిమానిని కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశ విజయం గురించే ఆలోచిస్తారు’ అని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారత క్రికెట్ జట్టు తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను 9 వేర్వేరు నగరాల్లో ఆడనున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో చెన్నైలో, రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరగనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19న పూణె మైదానంలో, ఐదో మ్యాచ్ న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22న ధర్మశాలలోని అందమైన మైదానంలో జరగనుంది.




వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్..
View this post on Instagram
భారత జట్టు ఆరో మ్యాచ్ ఇంగ్లండ్‌తో లక్నోలో జరగనుండగా, ఏడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే గ్రౌండ్‌లో జరిగే క్వాలిఫయర్-2లో జరుగుతుంది. నవంబర్ 5న కోల్‌కతాలోని చారిత్రాత్మక మైదానంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్వాలిఫయర్-1 జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. 2011 ప్రపంచకప్‌లో ప్రదర్శననే ఈ ప్రపంచకప్‌లో కూడా పునరావృతం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
View this post on Instagram
వరల్డ్ కప్ బరిలో నిలిచే భారత జట్టు..
View this post on Instagram
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్. షమీ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




