కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(105), శుభమాన్ గిల్(104) సెంచరీలతో.. కేఎల్ రాహుల్(52), సూర్యకుమార్ యాదవ్(72, నాటౌట్) అర్థ సెంచరీలతో మెరిశారు. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. దీంతో 3 వన్డేల సిరీస్‌ని భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.