- Telugu News Photo Gallery Cricket photos Shubman Gill Shreyas Iyer break Sachin Tendulkar VVS Laxman’s record with brilliant 200 run partnership in 2nd ODI vs Australia
IND vs AUS: 22 ఏళ్ల నాటి అరుదైన రికార్డ్ బ్రేక్.. సచిన్-లక్ష్మణ్‌ని అధిగమించిన గిల్-అయ్యర్ జోడీ..
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శుభమాన్ గిల్-శ్రేయాస్ అయ్యర్ జోడీ ఓ ఆరుదైన రికార్డ్‌ని నెలకొల్పారు.
Updated on: Sep 25, 2023 | 7:07 PM

IND vs AUS 2nd ODI: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడమే కాక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున శుభమాన్ గిల్(104), శ్రేయాస్ అయ్యర్(105) సెంచరీలతో రాణించారు.

వీరిద్దరూ వ్యక్తిగత సెంచరీలతోనే కాక రెండో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో నాల్గో అత్యధిక భాగస్వామ్యం అందించిన భారత జోడిగా గిల్-అయ్యర్ నిలిచారు.

గతంలో ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్- వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉండేది. సచిన్-లక్ష్మణ్ జోడీ ఇండోర్ వేదికగానే 2001లో ఆసీస్‌పై 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కాగా, ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీవీఎస్ లక్ష్మణ్-యువరాజ్ సింగ్ జోడీ అగ్రస్థానంలో ఉంది. ఈ జోడీ 2004లో 213 పరుగులు చేసింది.

అలాగే ఈ లిస్టు రెండో స్థానంలో విరాట్ కోహ్లీ-శిఖర్ ధావన్ (2016లో 212 రన్స్).. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ(2016లో 207) జోడీలు ఉన్నాయి.




