AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: జహీర్ ఖాన్ రికార్డ్‌ని సమం చేసిన సూర్య కుమార్ యాదవ్.. ఆ అరుదైన లిస్టులో మూడో ప్లేయర్‌గా రికార్డ్..

IND vs AUS 2nd ODI: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ (105), శుభ్‌మన్ గిల్ (104) సెంచరీలు చేయగా.. కేఎల్ రాహుల్ (52), సూర్యకుమార్ యాదవ్ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిలో సూర్య ఇన్నింగ్స్ అయితే మ్యాచ్‌కే హైలైట్. కేవలం 37 బంతుల్లోనే అజేయంగా 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలో స్కై ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. దీంతో అతను జహీర్ ఖాన్, రోహిత్ శర్మ సరసన కూడా చేరాడు.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 25, 2023 | 8:11 PM

Share
Surya Kumar Yadav: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు.

1 / 5
ఈ క్రమంలో సూర్య తన ఐపీఎల్ సహచరుడైన కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదిన 3వ భారత ఆటగాడిగా నిలిచాడు.

2 / 5
కాగా, వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఒకే ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మ్యాన్ జహీర్ ఖాన్. 2000లో జింబాబ్వే ఆటగాడు హెన్రీ ఒలోంగా వేసిన ఓ ఓవర్‌లో జహీర్ ఖాన్ 4 బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు.

3 / 5
రోహిత్ శర్మ: జహీర్ ఖాన్ తర్వాత రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 2017లో శ్రీలంక ఆటగాడు సురంగ లక్మల్ వేసిన ఓవర్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 4 సిక్సర్లు బాదాడు.

4 / 5
ఇక తాజాగా ఇదే ఫీట్‌ను సూర్య కనబర్చాడు. తద్వారా ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా జహీర్, రోహిత్ రికార్డులను సమం చేయడంతో పాటు.. ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా అవతరించాడు.

5 / 5