- Telugu News Photo Gallery Cricket photos Indian Players who missed golden chance of playing ICC Mega Event due to injuries, check here for the list
Team India: గాయాలతో మెగా టోర్నీలకు దూరమైన భారత ఆటగాళ్లు.. లిస్టులో ఎవరూ ఊహించని పేరు కూడా..!
Team India: వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ చాంపియన్‌షిప్ వంటి ఐసీసీ ఈవెంట్స్‌లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ప్రతి క్రికెటర్‌కి ఉండే కల. అయితే కొందరు భారత క్రికెటర్లు ఉన్నారు. వారు నిలకడగా రాణించగల సత్తా ఉన్నా.. గాయాల కారణంగా, ఫిట్‌నెస్ లేక మెగా టోర్నీలకు దూరమయ్యారు. ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 25, 2023 | 9:01 PM

ఇషాంత్ శర్మ: భారత జట్టులోని ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 2015 వరల్డ్ కప్ టోర్నీలో ఆడే అవకాశం కోల్పోయాడు. తనకు నొప్పి ఉన్నప్పటికీ వరల్డ్ కప్‌కి ముందు జరిగిన కొన్ని టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇషాంత్ ఇంజెక్షన్స్ తీసుకుని మరీ ఆడాడు. దీంతో ఆ తర్వాత జరిగిన మెగా టోర్నీకి అతను దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రవీణ్ కుమార్: టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ 2011 వరల్డ్ కప్ ఆడే అవకాశం పొందాడు. అయితే మోచేతి గాయం కారణంగా ఆటకు దూరం కావడంతో అతని స్థానంలో శ్రీశాంత్ జట్టులోకి వచ్చాడు.

రిషభ్ పంత్: భారత జట్టులోని చురుకైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్‌లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్.. ఇప్పటికే టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2023, ఆసియా కప్ 2023 టోర్నీలకు కూడా దూరమైన పంత్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కనిపించే సూచనలే లేవు.

జస్ప్రీత్ బూమ్రా: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా గాయాల పాలై ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022, టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కి దూరమయ్యాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని ఐర్లాండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ ద్వారా జట్టులోకి పునరాగమనం చేశాడు.

వీరేంద్ర సెహ్వగ్: గాయాలతో బాధపడుతూ మెగా టోర్నీలకు దూరమైన ఆటగాళ్ల లిస్టులో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ పేరు కూడా ఉంది. షోల్డర్ ఇంజూరీతో వీరూ భాయ్ టీ20 వరల్డ్ కప్ 2010 టోర్నీకి దూరం అయ్యాడు.





























