IND vs NZ: ‘ధోని పాత్రలో నేను.. బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ వారికి భరోసా ఇస్తా’: హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు..
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అద్భుతాలు చేయడమే కాదు, బ్యాటింగ్‌లోనూ జట్టుకు అవసరమైన పరుగులు సాధిస్తున్నాడు. అద్భుతమైన ఆల్ రౌండర్ పాత్రను పోషిస్తున్నాడు.
అహ్మదాబాద్‌లో జరిగిన మూడో, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 68 బంతుల్లో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో బౌలింగ్‌లో హార్దిక్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం సమాధానంగా కివీ జట్టు 66 పరుగులకే కుప్పకూలింది.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అద్భుతాలు చేయడమే కాదు, అంతకు ముందు అతను జట్టు కోసం 17 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగే ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హార్దిక్ మాట్లాడుతూ, “మహి (ధోని) పాత్రను పోషించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ సమయంలో, నేను యువకుడిని, ఆయన చుట్టూ తిరిగాను. కానీ, అతను వెళ్లిపోయినప్పటి నుంచి, అకస్మాత్తుగా నాపై బాధ్యత పెరిగింది. నేను పర్వాలేదు. మేం ఫలితాలను పొందుతున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
ధోని పాత్రలో పాండ్యా..
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలాగే జట్టు అవసరాన్ని బట్టి తన ఆటను మార్చుకోవాల్సి ఉంటుందని హార్దిక్ చెప్పుకొచ్చాడు. దీనిపై పాండ్యా మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ సిక్స్‌లు కొట్టడం ఆనందిస్తాను. కానీ, నేను నా ఆటలో మరికొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. నేను భాగస్వామ్యాన్ని నమ్ముతాను. నేను అక్కడ ఉన్నానని నా భాగస్వామి, నా జట్టుకు కొంత భరోసా ఇవ్వాలనుకుంటున్నాను” అంటూ పేర్కొన్నాడు.
హార్దిక్ మాట్లాడుతూ, ఒత్తిడిని ఎదుర్కోవడం, దాని నుంచి బయటపడటం, ప్రతిదీ సరిగ్గా జరిగేలా చూసుకోవడం ఎలాగో నేర్చుకున్నాను. దీని కోసం నేను నా స్ట్రైక్ రేట్‌ను తగ్గించుకోవాలి. కొత్త పాత్రలు పోషించాలి. నేను దాని కోసం సిద్ధంగా ఉన్నాను. నేను కొత్త బంతితో బౌలింగ్ చేయాలనుకుంటున్నాను. బౌలర్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఆ కఠినమైన పాత్రను పోషిస్తారంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..