Virat Kohli: యంగ్ ప్లేయర్‌కు బాసటగా కోహ్లీ.. ఈ వీడియో చూస్తే మీరూ మాజీ కెప్టెన్‌ను మెచ్చుకుంటారు..
భారత్, లీసెస్టర్‌షైర్(India vs leicestershire) మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత టీమిండియా జులై 1న ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
భారత మాజీ కెప్టెన్, వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎల్లప్పుడూ తన ఆటగాళ్లకు మద్దతుగా ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా వారికి తోడుగా ఉంటాడు. కెప్టెన్‌గా ఉన్నా, లేకపోయినా ఆటగాళ్లకు అండగా నిలవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. లీసెస్టర్‌షైర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లీ.. మరోసారి ఇలాంటి తెగువే ప్రదర్శించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో, అతను జట్టులోని యువ ఆటగాడు కమలేష్ నాగర్‌కోటి(Kamlesh Nagarkoti)పై ట్రోల్స్ చేస్తోన్న వారికి క్లాస్ తీసుకొని గుణపాఠం చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లీసెస్టర్‌షైర్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను విరాట్ కోహ్లీ అభిమానుల క్లబ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. బాల్కనీలోకి వచ్చిన కోహ్లీ.. స్టేడియంలో కూర్చున్న అభిమానులకు క్లాస్ పీకుతూ కనిపించాడు. శుక్రవారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు టీమిండియా యువ బౌలర్ కమలేష్ నాగర్‌కోటిని ట్రోల్ చేస్తున్నారని, ఈ విషయం తెలుసుకున్న కోహ్లీ.. ట్రోలర్లకు క్లాస్ పీకినట్లు ఆ వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. వీడియోలో, బాల్కనీ నుంచి కోహ్లి ట్రోలర్లను అరుస్తూ కనిపించాడు. ‘అతను మీ కోసం వచ్చాడు లేదా మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు’ అని వీడియోలో చెప్పడం వినిపించింది.
People talk about Surya Kumar yadav incident on how arrogant and egoistic Virat Kohli treat youngsters But no one will talk about this where Kohli got angry when crowd was bullying nagarkoti in recent practice match❤️ pic.twitter.com/TdIeUSPLTA
— akshat (@ReignOfVirat) June 25, 2022
కోహ్లికి ఈ పర్యటన చాలా కీలకం..
కోహ్లి పాత ఫాంలో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందుకోసం కోహ్లీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే, వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి మంచి ఫామ్‌లో కనిపించినా.. 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ రోమన్ వాకర్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూ చేశాడు. మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ లేదు. దీని కారణంగా కోహ్లి అవుట్ అయ్యాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కోహ్లి కూడా అంపైర్‌తో వాగ్వాదం చేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభం చాలా పేలవంగా మారింది. టీం స్కోర్ 35 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (25) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల వర్షం కురిసింది. 81 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. చాలా కాలంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్న కోహ్లీకి ఈ టూర్ చాలా కీలకం కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.