AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: గిల్, పంత్ కాదు.. టీమిండియాను గెలిపించింది అతడే.. ఏకంగా 58 ఏళ్ల చరిత్రనే

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. తద్వారా తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది భారత్. అయితే ఈ విజయంలో గిల్ కాదు.. భారత్‌ను గెలిపించింది ఒకే ఒక్కడు.. ముఖ్యంగా 58 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు.

IND Vs ENG: గిల్, పంత్ కాదు.. టీమిండియాను గెలిపించింది అతడే.. ఏకంగా 58 ఏళ్ల చరిత్రనే
Ind Vs Eng
Ravi Kiran
|

Updated on: Jul 07, 2025 | 12:29 PM

Share

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగింది. ఇందులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. సుమారు 336 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా 58 ఏళ్ల పరాజయాలకు చెక్ పెట్టింది. ఈ మైదానంలో తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో కేవలం గిల్ కాదు.. ముఖ్యంగా మరో ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియాను గెలిపించాడు. ముఖ్యంగా ఓ 5గురి ప్లేయర్స్ పెర్ఫార్మన్స్‌ గురించి మాట్లాడుకుందాం.

శుభ్‌మన్ గిల్‌:

కెప్టెన్సీలోనే కాదు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు గిల్. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. అలాగే భారత్ 608 టార్గెట్‌ నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆకాష్‌ దీప్:

ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ తన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. తొలిసారి ఇంగ్లాండ్ పిచ్‌పై ఆడుతున్నప్పటికీ.. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్‌ వేసి ప్రత్యర్ధులను భయపెట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మహమ్మద్ సిరాజ్:

తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ చక్కటి బౌలింగ్ వేశాడు. దీంతో ప్రత్యర్ధులు పరుగులు రాబట్టడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రవీంద్ర జడేజా:

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్‌తో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 69 పరుగులు సాధించాడు. ఇందులో గిల్‌తో సెంచరీ భాగస్వామ్యం కీలకం. అలాగే పొదుపుగా బౌలింగ్ వేశాడు.

యశస్వి జైస్వాల్:

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ టీం ఇండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..