India vs England : తొలి మ్యాచ్ లో ఓటమి చవిచూసిన టీమిండియా .. సునాయాసంగా గెలిచిన ఇంగ్లాండ్
India vs England : టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లో టీమిండియా ఏడూ వికెట్లు
India vs England : టీమిండియాతో జరగనున్న ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా అహ్మదబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లో టీమిండియా ఏడూ వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. టీమిండియాలో ధావన్ (4),రాహుల్ (1), కోహ్లీ (1), రిషబ్ పంత్ 21, శ్రేయాస్ అయ్యర్ 67, హార్దిక్ పాండే 19,ఠాకూర్ 0, సింధర్ 3, అక్సార్ 7 పరుగులు చేసారు. మొత్తంమీద టీమిండియా ఏడువికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.
124పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటినుంచి నిలకడగా ఆడింది. జాన్సన్ రాయ్ 49. బట్లర్ 28, డేవిడ్ మలన్ 24 పరుగులు, జానీ బెయిర్‌స్టో 26 పరుగులు చేసారు. మొత్తంగా 15.3 వోవర్లకు 130 పోయారుగులు చేసి విజయం సాధించారు. ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభమయ్యే చివరి క్షణంలో రోహిత్ శర్మకు విరామం ప్రకటించారు. దీంతో చివరి క్షణంలో రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారనే అనుమానం వస్తోంది. రోహిత్‌కు ఏమైనా గాయమయ్యిందా అనే కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు.అయితే టాస్ తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. కొన్ని మ్యాచ్‌లకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. కొంతకాలంగా ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, భారత జట్టు ఇటీవల రెండో స్థానికి చేరుకుంది. ఇక ఇప్పుడు మ్యాచ్ చేజారడంతో ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 4-1తో టీమిండియా గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది.
స్పాట్ …
మరిన్ని ఇక్కడ చదవండి :