IND vs CAN: చివరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
India vs Canada Match Florida Weather Update: టీ20 ప్రపంచ కప్ 2024 లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ని కెనడాతో లీగ్ దశలో ఆడనుంది. భారత జట్టు ఇప్పటికే సూపర్-8కి చేరుకోగా, కెనడా జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. ఈ కారణంగా, ఫ్లోరిడాలో జరగనున్న ఈ మ్యాచ్ లాంఛనప్రాయమే. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
India vs Canada Match Florida Weather Update: టీ20 ప్రపంచ కప్ 2024 లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ని కెనడాతో లీగ్ దశలో ఆడనుంది. భారత జట్టు ఇప్పటికే సూపర్-8కి చేరుకోగా, కెనడా జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. ఈ కారణంగా, ఫ్లోరిడాలో జరగనున్న ఈ మ్యాచ్ లాంఛనప్రాయమే. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, నిరంతర వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కానుందని తెలుస్తుంది.
ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు చోట్ల వరదలు వచ్చాయి. వర్షం కారణంగా ఇక్కడ అమెరికా, ఐర్లాండ్‌ల మధ్య మ్యాచ్ జరగకపోవడంతో పాక్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు..
ఇప్పుడు ఇదే మైదానంలో భారత్, కెనడా మధ్య మ్యాచ్ జరగనుంది. కానీ, వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్-కెనడా మ్యాచ్ జరగనున్న సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది. 50 శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఔట్‌ఫీల్డ్ కూడా బాగా తడిసిపోయింది.
వర్షం కారణంగా భారత్-కెనడా మ్యాచ్ రద్దైతే ఏం జరుగుతుంది?
New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx
— BCCI (@BCCI) June 14, 2024
భారత్-కెనడా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా.. అది ఏ జట్టుపైనా ప్రభావం చూపదు. భారత జట్టు తదుపరి రౌండ్‌కు చేరుకుంది. కెనడా జట్టు నిష్క్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ జరిగినా, జరగకపోయినా ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం చూపదు. ఏది ఏమైనప్పటికీ, పూర్తి మ్యాచ్ జరిగితే సూపర్-8కి ముందు టీమిండియా తన కొత్త కాంబినేషన్‌ను ప్రయత్నించే అవకాశాన్ని పొందడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు బెంచ్‌పై కూర్చున్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వవచ్చు.
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఈ ఆటగాళ్లకు ఆడే అవకాశం ఉండదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..