IND vs AUS, WTC 2023 Final: హెడ్, స్మిత్‌ల జోరు.. భారత బౌలర్ల బేజారు.. మొదటి రోజు ఆస్ట్రేలియాదే
సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. అప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బ్యాటర్లు తడబడితే ఈసారి మన బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ల జోరుతో ఆస్ట్రేలియా మొదటి రోజు కేవలం 3 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది.
సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. అప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో బ్యాటర్లు తడబడితే ఈసారి మన బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ల జోరుతో ఆస్ట్రేలియా మొదటి రోజు కేవలం 3 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. తద్వారా ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్‌లో బలమైన పునాది వేసుకుంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలిసారి ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరిస్తుందని అంతా భావించారు. పిచ్‌పై పచ్చికను చూస్తుంటే బ్యాటర్లకు ఇబ్బంది తప్పదనిపించింది. అటువంటి పరిస్థితిలో, జట్టు మొదట బౌలింగ్ చేసిన జట్లు లాభపడుతుందని భావించారు. అయతే అలాంటి దేమీ జరగలేదు. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టీమ్ ఇండియా ఆరంభించిన తీరు చూస్తుంటే మొదటి నుంచే భారత్ ఆధిపత్యం చెలాయిస్తుందనిపించింది. ఇందుకు తగ్గట్లే నాలుగో ఓవర్‌లోనే మహమ్మద్ సిరాజ్ వేసిన బంతికి ఉస్మాన్ ఖవాజా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
సిరాజ్, మహ్మద్ షమీ కలిసి ఆస్ట్రేలియాను బాగా కట్టడి చేశారు. మరోవైపు తొలి సెషన్ ముగియడానికి కాసేపు ముందు శార్దూల్ ఠాకూర్ వార్నర్ వికెట్ పడగొట్టాడు. అలా తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.రెండో సెషన్ ప్రారంభమైన వెంటనే భారత్ కు మరో వికెట్ దక్కింది. సెషన్ రెండో ఓవర్ తొలి బంతికే మహ్మద్ షమీ అద్భుతమైన ఇన్‌స్వింగ్‌తో లబుషెన్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్లు 76 పరుగులకే పడిపోడి కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ రాగనే టీమిండియాపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. స్మిత్ కూడా రాణించడంతో రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా 97 పరుగులు చేసింది. హెడ్ తన అర్ధ సెంచరీని కేవలం 60 బంతుల్లో పూర్తి చేశాడు. మూడో సెషన్‌లో భారత బౌలర్లు బాగా అలసిపోయినట్లు కనిపించడంతో స్మిత్, లాబుషేన్‌లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. పరుగుల వేగాన్ని పెంచి జట్టును 300 పరుగులకు మించి తీసుకెళ్లారు. ఈ సమయంలో, హెడ్ ఇండియాపై 106 బంతుల్లో తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం హెడ్ (146), స్మిత్ (95) పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు.
Stumps on the opening day of #WTC23 Final!
Australia ended Day 1 at 327/3.
See you tomorrow for Day 2 action.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw#TeamIndia pic.twitter.com/G0Lbyt17Bm
— BCCI (@BCCI) June 7, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..