WTC Final: ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ చేసిన ఆ తప్పే.. టీమిండియా కొంపముంచింది’

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా మొదటి రోజు పేలవమైన ఆటతీరు కనబరిచింది. మొదటి..

WTC Final: 'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ చేసిన ఆ తప్పే.. టీమిండియా కొంపముంచింది'
Wtc Final
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2023 | 12:55 PM

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా మొదటి రోజు పేలవమైన ఆటతీరు కనబరిచింది. మొదటి సెషన్‌లో వరుస వికెట్లు తీసి ఆశలు రేకెత్తించినప్పటికీ.. ఆ తర్వాత భారత బౌలర్లు చేతులెత్తేశారు. ట్రావిస్ హెడ్(146*), స్టీవ్ స్మిత్(95*) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను టాప్ ప్లేస్‌లో నిలబెట్టారు. తద్వారా తొలి రోజు కంగారూలు పైచేయి సాధించారు. ఇక ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. భారత జట్టు సెలక్షన్ సరిగ్గా లేదని, సెలక్టర్లు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక చేయడంలో తప్పు చేశారని చెప్పాడు. అలాగే ఫిస్ట్ ఇన్నింగ్స్ కోసమే భారత్ తుది జట్టును ఎంపిక చేసినట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రోహిత్ శర్మ తన కీ బౌలరైన అశ్విన్‌ను పక్కనపెట్టి తప్పు చేశాడు. అదే టీమిండియా కొంపముంచిందని చెప్పుకొచ్చాడు. ఆసీస్ జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఒకవేళ అశ్విన్ టీంలో ఉండి ఉంటే.. ఆసీస్‌కి గట్టిపోటీ ఉండేదని.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ అతడు కీలకంగా మారేవాడని ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.