AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?

India vs Afghanistan Test Squad 2026: భారత జట్టు వచ్చే నెల నుంచి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తొలుత ఆఫ్ఘాన్ జట్టుతో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, టెస్ట్ జట్టు సంబంధించిన స్వ్కాడ్ లీకైయినట్లు తెలుస్తోంది.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
India Vs Afghanistan Test SquadImage Credit source: https://x.com/JYajashvi_77_64
Venkata Chari
|

Updated on: May 11, 2026 | 4:27 PM

Share

India vs Afghanistan Test Squad 2026: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ, ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత బ్యాటింగ్ విభాగంలోని ప్రధాన ఆటగాళ్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించి ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈ మ్యాచ్‌కు సంబంధించిన భారత టెస్ట్ జట్టు వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్‌ను తప్పించినట్లు సమాచారం.

బ్యాటింగ్ విభాగంలో మార్పులు ఉండవు..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాటింగ్ కోర్ గ్రూపులో సెలక్టర్లు ఎలాంటి మార్పులు చేయడం లేదు. గతంలో శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, తాజా నివేదికల ప్రకారం గిల్‌ జట్టులో ఉండటమే కాకుండా జట్టును నడిపించే అవకాశం ఉంది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి అనుభవజ్ఞులు ఉండనున్నారు.

సాయి సుదర్శన్ ఔట్.. దేవదత్ పడిక్కల్ ఇన్..?

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ బి. సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో (సగటు 27.4), అతని స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. పడిక్కల్ డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

బుమ్రాకు విశ్రాంతి.. కొత్త బౌలర్లకు ఛాన్స్

జస్‌ప్రీత్ బుమ్రా గాయాల బెడద దృష్ట్యా, ఈ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భాగం కానందున అతనికి విశ్రాంతినివ్వనున్నారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల ఎంపిక ఐపీఎల్ పనిభారంపై ఆధారపడి ఉంటుంది. రంజీ ట్రోఫీలో రాణించిన ఆకిబ్ నబీ వంటి కొత్త ముఖాలకు అవకాశం దక్కవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడే భారత ప్రాబబుల్ టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ (కీపర్), ధ్రువ్ జురెల్ (కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహమ్మద్ షమీ, అన్షుల్ కాంబోజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us