Ind Vs Pak: ఎట్టకేలకు ఆ రోజు వచ్చింది.. టపాసులు కాల్చే అవకాశం తెచ్చింది..
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులకు ఈ మ్యాచ్ మంచి మజా ఇస్తుంది. 2015 వరల్డ్ కప్‌కు ఇండియా, పాక్ మ్యాచ్ ముందు అధికార ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఒక యాడ్ చేసింది...
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులకు ఈ మ్యాచ్ మంచి మజా ఇస్తుంది. 2015 వరల్డ్ కప్‌కు ఇండియా, పాక్ మ్యాచ్ ముందు అధికార ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఒక యాడ్ చేసింది. అందులో ఓ పాకిస్తానీ అభిమాన్ పాక్ గెలుస్తుందని కాకర్స్, టాపాసులు పేలుద్దామని తీసుకొస్తాడు. కానీ పాక్ ఓడిపోవటంతో వాటిని లోపలికి తీసుకెళ్తాడు. పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ జరిగినప్పుడల్లా అతను టాపాసులు పేలుద్దామని అనుకుంటాడు కానీ పాక్ ఓడిపోవటంతో వాటిని లోపలికి తీసుకెళ్తాడు. ఇదీ యాడ్ అందరికి ఎప్పటికైనా గుర్తు ఉంటుంది. కానీ చివరికి అతడి కోరిక నెరవేరింది.
అతడు టపాసులు కాల్చే రోజు వచ్చింది. దీనిపై మిమ్స్ వస్తున్నాయి. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు.
సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పాకిస్థాన్ ఓపెనర్ల వేగాన్ని మాత్రం భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాక్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారత్ ఇచ్చిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది. దీంతో ఇన్నాళ్లకు పాక్ అభిమాని కోరిక తీరింది. అతడు టాపాసులు పేల్చే యాడ్ కూడా చేయాల్సి ఉంటుందేమో..