IND vs PAK: బెడిసి కొట్టిన ధోనీ, కోహ్లీ వ్యూహం.. తొలిమ్యాచ్‌లోనే ధోనికి చేదు అనుభవం..
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్‌నకు ముందు మహేంద్ర సింగ్ ధోనిని గొప్ప అంచనాలతో టీమ్ ఇండియాకి మెంటార్‌గా నియమించారు. వరుస విజయాలు సాధిస్తారని
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్‌నకు ముందు మహేంద్ర సింగ్ ధోనిని గొప్ప అంచనాలతో టీమ్ ఇండియాకి మెంటార్‌గా నియమించారు. వరుస విజయాలు సాధిస్తారని అభిమానులు ఆశించారు కానీ ఇది జరగలేదు. టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్.. భారత్‌ని ఘోరంగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేయగా పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని సాధించింది.
పాకిస్థాన్ విజయంలో షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అద్భుత ప్రదర్శన చేశారు. బాబర్-రిజ్వాన్‌లు అర్ధ సెంచరీతో రాణించగా షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ధోనీ లాంటి అనుభవజ్ఞుడు మెంటార్‌గా ఉన్నప్పుడే టీమ్ ఇండియా పరిస్థితి ఇలా ఉందంటే రాబోయే మ్యాచ్‌ల పరిస్థితిని ఇంకెలా ఉంటుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ధోనీ-విరాట్ కోహ్లీ వ్యూహం బెడిసికొట్టింది.. మెంటర్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచడానికి వ్యూహాన్ని రూపొందించారు. కానీ ఇది పూర్తిగా ఫ్లాప్ అయింది. పాండ్యా బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. బౌలింగ్ కూడా చేయలేకపోయాడు. జట్టులో అతని పాత్ర శూన్యం. ఇదిలా ఉంటే పాండ్యా కంటే ముందే జడేజాను క్రీజులోకి పంపాడు. మరోవైపు శార్దూల్ ఠాకూర్ కంటే పేలవ ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్‌కి ప్రాధాన్యం లభించింది. శార్దూల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో నిపుణుడు. అతడు లేని లోటు స్పష్టంగా తెలిసింది. ఇది మాత్రమే కాదు.. మహమ్మద్ షమీని కొత్త బంతితో బౌలింగ్ చేయించారు. ఇది కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు.
పాకిస్థాన్ ఆటగాళ్లతో ధోనీ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో అతను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కలిసి ఉన్నారు. షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షానవాజ్ దహాని కూడా ధోనీతో ఉన్నారు. ధోనీ వారితో కలిసి నవ్వుతూ మాట్లాడుతుండటం గమనార్హం. ధోనీ చిట్కాలు భారత జట్టుకు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు.