IND vs PAK: షాహీన్ అఫ్రిది చేసిన పనికి పాక్ ఆగ్రహం.. అక్షయ్ కుమార్, జై షా ఆనందం
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021లో భారత్ అరంగేట్రం ఓటమితో మొదలైంది. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది.
IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021లో భారత్ అరంగేట్రం ఓటమితో మొదలైంది. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత టాప్ 3 బ్యాట్స్‌మెన్ వికెట్లు పడగొట్టాడు. అఫ్రిది పవర్‌ప్లేలో KL రాహుల్, రోహిత్ శర్మలను అవుట్ చేశాడు. అయితే అతని రెండో స్పెల్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌ను తీసుకున్నాడు. షాహీన్ అఫ్రిది తన బౌలింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కానీ అతని చివరి ఓవర్‌లో ఒక పొరపాటు చేసాడు. దీని కారణంగా పాకిస్తాన్ ఆటగాళ్ల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
వాస్తవానికి షాహీన్ అఫ్రిది 19 ఓవర్లో ఓవర్ త్రోతో 4 అదనపు పరుగులు ఇచ్చాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ విషయంపై ఆగ్రహించాడు. మరోవైపు భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా మైదానంలో నవ్వుతూ కనిపించాడు. ఆఫ్రిది వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యా బై ఆఫ్‌లో సింగిల్ కొట్టే ప్రయత్నం చేశాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ బంతిని షాహీన్ అఫ్రిది వైపు విసిరాడు. ఈ ఆటగాడు నాన్-స్ట్రైక్ ఎండ్‌లో వికెట్‌ని లక్ష్యంగా చేసుకున్నాడు కానీ అది జరగలేదు.
బంతి వికెట్‌ను తాకలేదు కానీ బౌండరీ దాటింది. అఫ్రిది వేసిన ఈ త్రోతో భారత్‌కు బ్యాట్ లేకుండానే 5 పరుగులు వచ్చాయి. ఇది చూసిన భారతీయ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. స్టేడియంలో కూర్చున్న నటుడు అక్షయ్ కుమార్, బీసీసీఐ సెక్రటరీ జై షా ఆనందంతో నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాక షాహీన్ అఫ్రిది తన చివరి ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా స్కోరు 150 దాటింది. అయితే షాహీన్ అఫ్రిది తన 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు. భారత్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 57 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు.
#AkshayKumar & Jay Shah’s Celebration Of 4 Runs Of Overthrow, Seeing Frustration Of Pakistani Player Gives Happiness #INDvPAK pic.twitter.com/dbKp2t21rb
— ᏢᏒᎾfᎬSSᎾᏒ Paul ? (@Vamos_Akshay) October 24, 2021