AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పాకిస్థాన్‌ మీడియాలో కోహ్లీకి KGF లెవెల్‌ ఎలివేషన్లు! ఏం రాశారో చూడండి!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన 100 పరుగుల ఇన్నింగ్స్ ఆడి, భారత విజయానికి కీలకమయ్యాడు. కోహ్లీ సెంచరీ, భారత బౌలింగ్ దాడితో పాకిస్థాన్ జట్టును సులువుగా ఓడించింది. పాకిస్థాన్ మీడియా కోహ్లీ ప్రదర్శనను ప్రశంసిస్తూ, కోహ్లీని ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ లను మించిందని అభివర్ణించింది.

Champions Trophy: పాకిస్థాన్‌ మీడియాలో కోహ్లీకి KGF లెవెల్‌ ఎలివేషన్లు! ఏం రాశారో చూడండి!
Virat Kohli Pakistan News
SN Pasha
|

Updated on: Feb 24, 2025 | 2:36 PM

Share

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన దుమ్మురేపింది. ఎంతో కీలకమైన టాస్‌ ఓడిపోయినప్పటికీ కూడా అద్భుతమైన బౌలింగ్‌, అంతకంటే అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా చాలా సులువుగా దాయాది పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. 242 పరుగుల టార్గెట్‌ను కేవలం 42.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో హైలెట్‌ ఏంటంటే.. విరాట్‌ కోహ్లీ సెంచరీ. మ్యాచ్‌ ఆసాంతం టీమిండియా ఇన్నింగ్స్‌కు మూలస్థంభంలా నిల్చున్న కోహ్లీ.. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని ముందే ఫిక్స్‌ అయినట్లు ఆడాడు. కాస్త స్లోగా ఆడినప్పటికీ.. ఆ బ్యాటింగ్‌ స్టైల్‌ పిచ్‌ కండీషన్‌కు తగ్గట్లు ఉంది. మొత్తంగా 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసుకొని.. తన కెరీర్‌లో 82వ సెంచరీ, వన్డేల్లో 51వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే టీమిండియా విజయానికి దగ్గరవుతున్న తరుణంలో కోహ్లీ కూడా సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో అసలు సెంచరీ పూర్తి చేస్తాడా లేదా అనే టెన్షన్‌ అభిమానులకు ఎక్కువైపోయింది. పాకిస్థాన్‌పై మ్యాచ్‌ గెలిచిన ఆనందం కంటే.. కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నందుకు క్రికెట్‌ లోకం సంబురాలు చేసుకోండి. పాక్‌పై విజయం కంటే కోహ్లీ సెంచరీ స్పెషల్‌గా మారింది. అది విరాట్‌ కోహ్లీ రేంజ్‌. అయితే.. కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ పాకిస్థాన్‌కు ఓటమినే కాదు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించేలా చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మీడియాలో విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు, పాకిస్థాన్‌ టీమ్‌పై విమర్శల వర్షం కురిసింది.

ఇప్పుడనే కాదు పాకిస్థాన్‌తో ఎప్పుడు మ్యాచ్‌ ఉన్నా కూడా విరాట్‌ కోహ్లీ తన హండ్రెడ్‌ పర్సెంట్‌ ఇస్తాడు. ఒకటీ అరా మ్యాచ్‌ల్లో విఫలం అయ్యాడు తప్పితే.. పాక్‌తో మ్యాచ్‌ అంటే కోహ్లీకి పూనకాలే. అందుకే విరాట్‌కోహ్లీ తన జట్టు ఓటమికి కారణం అవుతున్నా.. కోహ్లీ ఆటకు పాకిస్థాన్‌ మొత్తం ఫిదా అవుతోంది. తాజాగా ఆదివారం మ్యాచ్‌ తర్వాత సోమవారం పాకిస్థాన్‌ మీడియా మొత్తం కోహ్లీకి కేజీఎఫ్‌ లెవెల్‌లో ఎలివేషన్స్‌ ఇచ్చాయి. పాకిస్థాన్‌ను మరోసారి ఓడించాడు, కింగ్‌ కోహ్లీ, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అంటూ ఇండియన్‌ మీడియాను మించి పాక్‌ మీడియా విరాట్‌ను పొగిడింది.

డాన్‌(Dawn) అనే పాకిస్థాన్‌ ఇంగ్లీష్ పేపర్లో అయితే.. కోహ్లీని గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌గా అభివర్ణిస్తూ.. భారత్‌ – పాక్‌ రైవర్రీలో ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌లను మించి విరాట్‌ కోహ్లీ ప్రభావం చూపిస్తున్నాడంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. నిజానికి ఇండియా పాకిస్థాన్‌ తలపడిన అన్ని మ్యాచ్‌లను కలిపి చూస్తే.. మనపై పాక్‌కే మంచి రికార్డ్‌ ఉంది. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ లాంటి వాళ్లు ఇండియాపై మంచి ప్రదర్శన చేసేవారు. వారికి భారత్‌పై మంచి రికార్డ్‌ ఉంది. కానీ, వారిని కూడా కోహ్లీ దాటేశాడని, ఇండియా-పాక్‌ రైవర్రీలో కోహ్లీ అంత గొప్పగా ఆడే ప్లేయర్‌ రెండు దేశాల్లోనూ లేడంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.